Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?
హోండా కంపెనీ త్వరలో మనదేశంలో కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది. అవే హోండా జెడ్ఆర్-వీ, బీఆర్-వీ.

ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీలు ఎంతో ఇంట్రస్టింగ్ కార్లను ప్రదర్శనకు ఉంచాయి. ఉదాహరణకు హోండాను చూసుకుంటే.. కొత్త ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. భవిష్యత్తులో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే చిన్న ఎస్‌యూవీ ఇది. ప్రస్తుతానికి దీన్ని జెడ్ఆర్-వీ అని పిలుస్తున్నారు. ఇది చూడటానికి స్టోర్టీగా ఉంటూ క్రెటా, సెల్టోస్‌కి మంచి పోటీ ఇవ్వనుంది.
కాన్సెప్ట్‌గా మాత్రమే చూస్తే.. స్పోర్ట్స్ లుక్‌తో ఉంటూ మిగతా కంపెనీల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించాలని హోండా ఆలోచిస్తోంది. ఈ ఎస్‌యూవీ కాంపాక్ట్‌గా ఉంటూనే స్పోర్టీగా ఉండటం విశేషం. రూఫ్‌లైన్‌ను కూడా బాగా డిజైన్ చేశారు. హోండా ప్రొడక్షన్ వెర్షన్ కూడా ఇలానే ఉంటే ఈ మోడల్ కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
దీని డిటైలింగ్ కూడా చాలా బాగుంది. పెద్ద చక్రాలు, క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, గ్రిల్‌ను మ్యాచ్ చేసే హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హోండా సిటీలో ఉన్న 1.5 లీటర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతోనే ఈ కార్లు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
దీంతోపాటు బీఆర్-వీలో కొత్త వేరియంట్ కూడా కనిపించింది. ఇంతకుముందు లాంచ్ అయిన మోడల్ కంటే ఇది చూడటానికి చాలా బాగుంది. బీఆర్-వీ చూడటానికి ఒక ప్రాక్టికల్ ఎస్‌యూవీలా కనిపిస్తోంది. మోడర్న్ ఇంటీరియర్స్, మరింత టెక్నాలజీని ఇందులో అందించారు. ఇది మూడు వరుసల ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. మనదేశంలో ఆర్‌పీవీలు, ఇతర ఎస్‌యూవీలతో ఇది పోటీ పడనుంది. హోండా సిటీ తరహా లేన్-వాచ్ ఫీచర్‌ను అందించారు. ఇందులో కొత్త అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.
ప్రస్తుతం మనదేశంలో మూడు వరుసల ఎస్‌యూవీలకు డిమాండ్ ఎంతగానో పెరుగుతోంది. కొత్త బీఆర్-వీ కూడా త్వరలో లాంచ్ కానుందని అనుకోవచ్చు. దీంతోపాటు హోండా 2023 ప్రారంభంలో మరో ఎస్‌యూవీని కూడా మనదేశంలో లాంచ్ కానుంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

