By: ABP Desam | Updated at : 17 Sep 2021 09:35 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టీవీఎస్ రైడర్
టీవీఎస్ మనదేశంలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అదే టీవీఎస్ రైడర్. దీని ధరను మనదేశంలో రూ.77,500గా(ఎక్స్-షోరూం, ఢిల్లీ) నిర్ణయించారు. ఇందులో 125సీసీ ఇంజిన్‌ను అందించారు. అయితే ఇది కమ్యూటర్ బైక్ అయినప్పటికీ దీని డిజైన్ స్పోర్ట్స్ లుక్‌లో ఉండటం విశేషం. ఇందులో ఎన్నో సూపర్ ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. ఎల్ఈడీ సిగ్నేచర్ ఉన్న ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇందులో ఉండనుంది. ఎల్ఈడీ టెయిల్ లైట్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్ ఉన్న మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను ఇందులో అందించారు.
అల్యూమినియం గ్రాబ్ రెయిల్ ఉన్న స్ప్లిట్ సీట్, బ్లాక్డ్ ఔట్ మెకానికల్స్, అల్యూమినియం ఎండ్ క్యాప్ ఉన్న అప్‌స్వెఫ్ట్ మఫ్లర్ కూడా ఇందులో ఉండనుంది. ఇందులో ఇంజిన్ గార్డ్, అండర్ సీట్ స్టోరేజ్ ఉండనుంది. దీని కెర్బ్ వెయిట్ 123 కేజీలుగా ఉండనుంది.
ఇందులో ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. స్పీడ్, ట్రిప్ మీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టాకోమీటర్, ఫ్యుయల్ ఎకానమీ, టాప్ యావరేజ్ స్పీడ్, హెల్మెట్ ఇండికేటర్, ఓడోమీటర్, ఫ్యుయల్ గేజ్ వంటివి అందులో చూసుకోవచ్చు. ఎకో, పవర్ రైడింగ్ మోడ్స్‌తో ఈ విభాగంలో లాంచ్ అయిన మొదటి బైక్ ఇదే. దీంతోపాటు ఇందులో సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ అనే ఫీచర్‌ను కూడా అందించారు. అంటే సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజిన్ ఆన్ చేయడం కుదరదన్న మాట.
ఇందులో స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ వేరియంట్లో ఐదు అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందించారు. దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్, మెసేజ్‌లు, నేవిగేషన్, డిజిటల్ డాక్యుమెంట్ డిస్‌ప్లే, డే అండ్ నైట్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టీవీఎస్ రైడర్‌లో 124.8 సీసీ ఇంజిన్ అందించారు. ఫైవ్-స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు. లీటరుకు 67 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుందని కంపెనీ అంటోంది. ఈ విభాగంలో బెస్ట్ యాక్సెలరేషన్, టార్క్‌ను ఇది అందించనుందని తెలిపింది. ఇందులో ఉన్న ఇంటెలిగో టెక్నాలజీ ద్వారా శబ్దం రాకుండానే స్టార్ట్ అవుతుంది. ఇక బ్రేకుల విషయానికి వస్తే.. ముందువైపు 240 ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్‌ను అందించగా, వెనకవైపు 130 ఎంఎం రేర్ డ్రమ్ బ్రేక్‌ను అందించారు.
Also Read: Affordable Cars: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.4 లక్షల్లో టాప్-3 ఇవే!
Also Read: 2021 Kia Carnival: కియా కార్నివాల్ కొత్త వేరియంట్లు వచ్చేశాయ్.. ప్రీమియం ఫీచర్లు.. కంఫర్ట్ సూపర్!
Maruti Suzuki: గ్రాండ్ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్
Bajaj Qute Auto Taxi: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..
Maruti Suzuki: ఈ కార్ మోడల్స్ మీ దగ్గర ఉంటే వెంటనే కంపెనీకి తిప్పి పంపండి, ఆలస్యం చేస్తే ప్రాణగండం
Tata Motors: సఫారీ, హారియర్‌ల్లో రెడ్ ఎడిషన్లు లాంచ్ చేసిన టాటా - వావ్ అనిపించే ఫీచర్లు!
Top Hatchback Cars: రూ.10 లక్షల లోపు హ్యాచ్ బ్యాక్ కారు కొనాలి అనుకుంటున్నారా? అయితే, ఓసారి లిస్టు చూడండి!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !