search
×

MobiKwik RuPay Card: మొబిక్విక్‌ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!

డిజిటల్‌ లావాదేవీల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని మొబిక్విక్‌ మరో కార్డును తీసుకొచ్చింది. దీంతో రూ.30వేల క్రెడిట్‌ లభిస్తోంది. ముందు ఏదేనా కొనుక్కొని తర్వాత చెల్లించే సౌకర్యం ఉంది.

FOLLOW US: 

ఫిన్‌టెక్‌ కంపెనీ మొబిక్విక్‌ మరో కొత్త డిజిటల్‌ కార్డును ఆవిష్కరించింది. యాక్సిస్‌ బ్యాంక్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆప్ ఇండియా (NCPI)తో కలిసి మొబిక్విక్‌ రూపేకార్డును విడుదల చేసింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ఆరంభించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఈ కార్డుతో ఉచితంగానే చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది.

రూ.2 లక్షల వరకు మొబిక్విక్ వ్యాలెట్‌ బాలెన్స్‌ ఇప్పుడు మొబిక్విక్‌ రూపే ప్రీపెయిడ్‌ కార్డుతో వాడుకోవచ్చు. మొబిక్విక్‌ మర్చంట్‌ నెట్‌వర్కే కాకుండా 190 దేశాలు, 4.1 కోట్ల మర్చంట్స్‌ వద్ద దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డు యూజర్లు నేరుగా మొబిక్విక్‌ జిప్‌కు అర్హులు అవుతారు. ఇదో బీఎన్‌పీఎల్‌ ప్రొడక్ట్‌. అంటే ఇప్పుడు కొని తర్వాత చెల్లించొచ్చు. యూజర్‌ వాలెట్‌లో రూ.30వేల వరకు క్రెడిట్‌ ఉంటుంది. ప్రతి లావాదేవీపై రూపే కార్డు, మొబిక్విక్‌ సూపర్‌క్యాష్‌ ద్వారా రెండురకాల ఆఫర్లను పొందవచ్చు.

మొబిక్విక్‌ రూపే కార్డు ప్రత్యేకతలు

  • యాక్టివేషన్‌ ఫీజులు లేవు
  • హోమ్‌ సెంటర్‌పై 50 శాతం, ఉబెర్‌ బుకింగ్స్‌పై 30 శాతం వరకు రాయితీ
  • రూ. 2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా (మరణించినా, పూర్తిగా అంగవైకల్యం వచ్చినా)
  • కార్డు కొనుగోళ్లపై మొబిక్విక్‌ సూపర్‌క్యాష్‌

ఇవే  కాకుండా టోకెనైజేషన్‌, ఆఫ్‌లైన్‌ ట్రాన్సిట్‌, ప్రయాణాలు, డైనింగ్‌, రిటైల్‌ షాపింగ్‌, బిల్లుల చెల్లింపులపై రూపే ఆఫర్లు అందిస్తోంది. బహుమతులు లేదా పూల బొకేల డెలివరీ, రెస్టారెంట్‌ రిఫరల్‌, ఐటీ రిటర్నుల దాఖలు చేయడంలో 24x7 సహాయం తీసుకోవచ్చు.

Also Read: Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!

Also Read: PM Modi Launches RBI Schemes: రెండు కొత్త పథకాలు ఆరంభించిన ప్రధాని మోదీ.. ఆర్‌బీఐ పరిధిలోని ఈ 2 స్కీములతో ప్రజలకు లాభాలివే!

Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!

Also Read: House Rent Allowance: కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు..! 2022 జనవరి నుంచి పెరగనున్న జీతాలు.. వివరాలు ఇవే

Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 01:20 PM (IST) Tags: Axis Bank MobiKwik MobiKwik RuPay Card RuPay Card NPCI

సంబంధిత కథనాలు

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల