House Rent Allowance: కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు..! 2022 జనవరి నుంచి పెరగనున్న జీతాలు.. వివరాలు ఇవే
ఇప్పటికే డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఆర్ఏ పెంచేందుకు సిద్ధమైంది. రైల్వే ఉద్యోగుల సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంది. పెరుగుదల మాత్రం అందరికీ వర్తించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు! 2022, జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి. హెచ్‌ఆర్‌ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) పెంపునకు ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. కొన్ని రోజుల కిందటే ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెంచిన సంగతి తెలిసిందే.
కసరత్తు మొదలు
మొత్తం 11.56 లక్షల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంచాలన్న డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపించారు. వారు ఆమోదం తెలపగానే 2022, జనవరి నుంచి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెరగనుంది.
డిమాండ్ ఎవరు చేశారు?
వచ్చే ఏడాది నుంచి హెచ్ఆర్‌ఏను అమలు చేయాలని ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (ఐఆర్‌టీఎస్‌ఏ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్‌ఎఫ్‌ఐఆర్) డిమాండ్ చేశాయి. ఈ పెరుగుదల కేంద్ర ప్రభుత్వంలోని అందరు ఉద్యోగులకు వర్తిస్తుంది.
ఎలా లెక్కిస్తారు?
ఎక్స్, వై, జెడ్‌గా వర్గీకరించిన నగరాలను బట్టి హెచ్‌ఆర్‌ఏ లెక్కిస్తారు. 'ఎక్స్' విభాగంలోకి వచ్చే ఉద్యోగులకు నెలకు రూ.5400 కన్నా ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ రానుంది. 'వై' విభాగంలోని వారికి రూ.3600, 'జడ్' విభాగంలోని వారికి రూ.1800 వరకు పెరుగుతుంది.
కేటగిరీ ఎలా నిర్ణయిస్తారు?
50 లక్షలకు పైగా జనాభా ఉండే నగరాలు 'ఎక్స్' విభాగంలోకి వస్తాయి. ఈ నగరాల్లో ఉండే కేంద్ర ఉద్యోగులకు 27 శాతం హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది. వై, జడ్ విభాగాల్లోని వారికి వరుసగా 18%, 9% పెరుగుతాయి.
Also Read: Cryptocurrency Prices Today: రూ.36వేలు తగ్గిన బిట్‌కాయిన్.. మిగతావీ నష్టాల బాటలోనే..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్
Also Read: Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్.. ఎందుకంటే?
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!