By: ABP Desam | Updated at : 11 Nov 2021 11:17 AM (IST)
Edited By: Ramakrishna Paladi
ఈపీఎఫ్‌వో
ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగులు, కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా మరణాలు దీని పరిధిలోకి రావు.
ఈపీఎఫ్‌వో ఉద్యోగి ఎవరైనా అకాల మరణం చెందితే ఉద్యోగి కుటుంబానికి సంస్థ మరణ పరిహారం చెల్లిస్తుంది. దీనిని రెట్టింపు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దానిని ఇప్పటి నుంచి అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్‌వోలో పనిచేస్తున్న 30వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగి మరణిస్తే ఇప్పుడు రూ.8 లక్షలు నామినీకి లేదా కుటుంబ సభ్యులకు వస్తుంది. 2006లో కేవలం రూ.50వేలు మాత్రమే ఉద్యోగిపై ఆధారపడిన వారికి ఇచ్చేవారు. దానిని ఇంతకు ముందే రూ.4.20 లక్షలకు పెంచారు. ఆ తర్వాత ప్రతి మూడేళ్లకే పది శాతం పెంచుతూ పోయారు. కానీ కనీసం రూ.10 లక్షలు గరిష్ఠంగా రూ.20 లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పరిహారంగా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండటంతో ఇప్పుడు రూ.8 లక్షలకు అంగీకారం తెలిపారు.
ఈపీఎఫ్‌వో ఉత్తర్వుల ప్రకారం కొవిడ్ కాకుండా సహజంగా లేదా ప్రమాదశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.8 లక్షలు అందుతాయి. సంస్థలోని ప్రతి ఉద్యోగికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. సమాన పరిహారమే లభిస్తుంది. సంక్షేమ నిధి నుంచి ఈ మొత్తం అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఒకవేళ కరోనా నుంచి మరణిస్తే 2020, ఏప్రిల్ 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పరిహారం అందిస్తారు.
Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్..! క్రెడిట్ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
EV Fire Incidents: తయారీ లోపంతోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు- తేల్చిన కేంద్రం - నెలరోజుల్లో చర్యలు !
Multibagger share: 6 నెలల్లో ఈ అదానీ కంపెనీ షేరు కోట్లు కురిపిస్తుందట!
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! 600 + నుంచి 100 - కు సెన్సెన్స్!
Cryptocurrency Prices: జోష్‌లో క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్, ఎథీరియమ్
NPS Scheme: మరో అప్డేట్ ఇచ్చిన ఎన్పీఎస్ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం