Cryptocurrency Prices Today: రూ.36వేలు తగ్గిన బిట్‌కాయిన్.. మిగతావీ నష్టాల బాటలోనే..!
నవంబర్ 12 క్రిప్టో కరెన్సీ ధరలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బిట్‌కాయిన్ రూ.36వేల వరకు తగ్గింది.
క్రిప్టో కరెన్సీ ధరలు శుక్రవారం ఒడుదొడులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. 24 గంటల్లో బిట్‌కాయిన్ విలువ 0.69 శాతం తగ్గి రూ.52,09,338 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ.36,424 పడిపోయింది. ప్రస్తుతం బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా రూ.91 ట్రిలియన్లుగా ఉంది. ఎథిరెమ్ 1.14 శాతం పెరిగి రూ.3,81,759 వద్ద ఉంది. టెథెర్ (యూఎస్‌డీటీ) 0.49 శాతం తగ్గి రూ.80.74, రిపిల్ (ఎక్స్‌ఆర్‌పీ) 1.85 శాతం తగ్గి రూ.97.45 వద్ద కొనసాగుతున్నాయి. కర్డానో (ఏడీఏ) 2.56శాతం తగ్గి రూ.167.3, పొల్కాడాట్ (డీఓటీ) 4.22 శాతం తగ్గి రూ.3779, డోజీకాయిన్ (డీవోజీఈ) 0.20 శాతం తగ్గి రూ.21.21 వద్ద ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Bringing out the 🧵 Threader in you ✍️
— CoinDCX: Making Crypto Accessible to Indians (@CoinDCX) November 12, 2021
Every Friday we will be featuring the best #crypto thread submitted by the community.
Rules:
1. Tag CoinDCX
2. Use #CoinDCXCommunity
Here's this week featured entry 👇 https://t.co/xoNZOplcsM
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్
Also Read: Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్.. ఎందుకంటే?
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!