అన్వేషించండి

Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్‌.. ఎందుకంటే?

స్టాక్‌ మార్కెట్లో సూపర్‌ హిట్టైన జొమాటో అంతర్జాతీయ వ్యాపారాలన్నీ మూసేసింది. లాభదాయకత పెంచుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, యూరప్‌లో సేవలు నిలిపివేసింది.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ అగ్రిగేటర్‌ జొమాటో దాదాపుగా అంతర్జాతీయ వ్యాపారాలన్నీ మూసేసింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌లో సేవలు నిలిపివేయగా తాజాగా లెబనాన్‌ వ్యాపారాన్ని ముగించింది. కాస్త లాభదాయకంగా ఉన్న యూఈలో సేవలు కొనసాగుతాయని అయితే ఫుడ్‌ డెలివరీ ఉండదని పేర్కొంది. డైనింగ్‌ ఔట్‌ బిజినెస్‌ కొనసాగించనుంది.

'లెబనాన్‌లో మా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం. ఇప్పటి వరకు మిగిలిన అంతర్జాతీయ వ్యాపారం ఇదొక్కటే. యూఏఈలో మాత్రం డైనింగ్‌ ఔట్‌ సేవలు కొనసాగుతాయి. గతేడాది నుంచీ అంతర్జాతీయ వ్యాపారాలను నిలిపివేస్తున్నాం' అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. 

జొమాటో తన వ్యాపారాన్ని మూడు ప్రాంతాలుగా విభజించింది. అవి భారత్‌, యూఏఈ, రెస్టాఫ్‌ వరల్డ్‌ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, మలేసియా, యూఎస్‌ఏ, లెబనాన్‌, టర్కీ, చెక్‌, స్లోవేకియా, పొలాండ్‌, కతార్‌, ఐర్లాండ్‌). ఇప్పటి వరకు ఆదాయం పరంగా ఆ సంస్థకు అతిపెద్ద మార్కెట్‌ భారత్‌ (రూ.981 కోట్లు, జులై-సెప్టెంబర్‌ క్వార్టర్‌) మాత్రమే. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ (రూ.33 కోట్లు) ఉంది.

తాజా త్రైమాసికంలో మూసేసిన లెబనాన్‌ బిజినెస్‌ జొమాటో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ జొమాటో ఐర్లాండ్‌ లిమిటెడ్‌ కింద ఉంది. అంతకు ముందు క్వార్టర్లో సింగపూర్‌లోని జొమాటో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రిటన్‌లో జొమాటో యూకే లిమిటెడ్‌, అమెరికాలోని నెక్స్టబుల్‌ ఇంక్‌ను మూసేసింది. 'క్లీన్‌ డ్రైవ్‌'లో భాగంగా మూసివేతను చేపట్టింది.

లాభాలు వచ్చే ప్రాంతాల్లో వ్యాపారంపై దృష్టి పెట్టాలని జొమాటో నిర్ణయించుకుంది. మెట్రోలే కాకుండా చిన్న నగరాలు, పట్టణాల్లో సేవలను విస్తరించనుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ కామర్స్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఇండియన్‌ స్టార్టప్పుల్లో బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. సంజీవ్‌ బిక్‌చందానికి చెందిన ఇన్ఫోఎడ్జ్‌, చైనాకు చెందిన అలీబాబా మాదిరిగా అంకురాల్లో పెట్టుబడులు పెట్టనుంది.

Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Old Currency: 50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
50, 100 రూపాయల నోట్లు ఉన్న వాళ్లు కోటీశ్వరులే! పూర్తి వివరాలు ఇవే! 
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget