search
×

Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!

చాలా మంది క్రెడిట్‌ స్కోరు పెంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంటారు. అందుకే ఈ తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవడం తేలికే.

FOLLOW US: 

మీకు క్రెడిట్‌ కార్డు లేదా? ఎప్పుడూ లోన్‌ తీసుకోలేదా? మీ జవాబు అవును అయితే మీకు మంచి క్రెడిట్‌ హిస్టరీ ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు రుణాలు త్వరగా ఇవ్వవు! ఎందుకంటే క్రెడిట్‌ స్కోరు బాగుంటేనే రుణాలు త్వరగా ఇస్తారు. అందుకే క్రెడిట్‌ స్కోరు పెంచుకొనేందుకు ఈ పద్ధతులు పాటించండి.

క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేయండి
గతంలో అప్పులు తీసుకోని వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడతాయి! లోన్‌ తీసుకొనేటప్పుడు మీ విలువను పెంచుకోవడమే ఇందుకు పరిష్కారం. మీరు సరైన సమయానికి రుణ వాయిదాలు చెల్లిస్తారా? కచ్చితత్వంతో డబ్బులు చెల్లిస్తారా? అనేది వారికి తెలియాలంటే మీకు మంచి క్రెడిట్‌ స్కోరు అవసరం. ఇందుకు మీరు మొదటగా చేయాల్సింది క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం.

అన్‌సెక్యూర్డు కార్డు వాడండి
అన్‌ సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు వినియోగం మరో టెక్నిక్‌! అంటే మీ కార్డును కుటుంబ సభ్యులు ఉపయోగించేలా చేయాలి. అప్పుడు క్రెడిట్‌ కార్డు వినియోగం పెరుగుతుంది. ఫలితంగా క్రెడిట్‌ స్కోరు పెంచుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో అస్సలు పొరపాట్లు చేయకూడదు. లేదంటే మొదటికే మోసం వస్తుంది.

ఎక్కువ కార్డులు వద్దు
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు వాడటం మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మరిన్ని కార్డుల కోసం దరఖాస్తు చేయకుండా ఇప్పటికే మీ వద్ద ఉన్న కార్డును మీ అవసరాలకు ఉపయోగించండి.

తరచూ వినియోగించండి
క్రెడిట్‌ కార్డును నిలకడగా ఉపయోగించడం ముఖ్యం. ఎప్పుడో ఒకసారి కాకుండా తరచూ వినియోగిస్తేనే క్రెడిట్‌ ఏజెన్సీలు మీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి రేటింగ్‌ ఇస్తాయి. నెలకు కనీసం ఒక్కసారైనా కార్డును ఉపయోగించండి. మంచి క్రెడిట్‌ హిస్టరీ ఉన్న వాళ్లూ ఇదే సలహా ఇస్తున్నారు.

లిమిట్‌ చూసుకోండి
మీ క్రెడిట్‌ కార్డుకు లిమిట్‌ ఉంటుందని తెలుసు కదా! ఇదీ ముఖ్యమే. క్రెడిట్‌ బ్యూరోలు దీనినీ పరిశీలిస్తాయి. బ్యాలన్స్‌ టు లిమిట్‌ నిష్పత్తిని చూస్తాయి. ఎప్పుడూ పూర్తి లిమిట్‌ను ఉపయోగించొద్దు. క్రెడిట్‌ రేషియోను 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి.

క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి
మంచి క్రెడిట్‌ స్కోర్‌ రావాలంటే క్రెడిట్‌ కార్డు వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. మీ క్రెడిట్‌ కార్డు సంస్థలు మీ ఆర్థిక సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు ఇస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలస్యంగా చెల్లింపులు చేస్తే అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. అలా జరగకుండా క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి.

ఏడాది తర్వాత సెక్యూర్డుకు దరఖాస్తు చేయండి
క్రెడిట్‌ కార్డును ఉపయోగించిన ఆరు నెలల తర్వాత క్రెడిట్‌ రిపోర్టు జనరేట్‌ అవుతుంది. మీకు సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు కావాలంటే సంవత్సరం పాటు మీ రుణ చరిత్ర బాగుండేలా చూసుకోవాలి. తీసుకున్న అప్పు సరిగ్గా చెల్లిస్తారన్న ముద్ర వేసుకోవాలి. సెక్యూర్డు, ఎక్కువ లిమిట్‌ కలిగిన క్రెడిట్‌ కార్డులతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

సుదీర్ఘ కాలం ఈఎంఐలు
మీరెప్పుడైనా రుణం తీసుకుంటే సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే మంచిది. అప్పుడు మీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది. సరైన సమయానికి చెల్లింపులు చేయగలరు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తుంటే మీ క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది.

నిలకడగా కార్డు వాడండి
రుణ చరిత్రను రాత్రికి రాత్రే సృష్టించలేరు. తరచూ ఉపయోగించడం, సరైన పద్ధతిలో డబ్బు వాడుకోవడం, ఏడాదికి ఆర్నెల్లు కనీసం వాడితే క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ సమయమే పట్టొచ్చు. అందుకే క్రమం తప్పకుండా కార్డు వాడండి.

Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 08:54 AM (IST) Tags: credit score loan Credit Card Bank credit history credit limit credit agency

సంబంధిత కథనాలు

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్, పసిడిపై ఎంత తగ్గిందంటే- మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్, పసిడిపై ఎంత తగ్గిందంటే- మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: ఇది బిగ్ గుడ్‌న్యూస్ గురూ! పసిడి భారీగా పతనం, వెండి కూడా అంతే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: ఇది బిగ్ గుడ్‌న్యూస్ గురూ! పసిడి భారీగా పతనం, వెండి కూడా అంతే - మీ నగరంలో రేట్లు ఇవీ

SBI Q4 Result: బంపర్‌ డివిడెండ్‌ ప్రకటించిన ఎస్‌బీఐ! రికార్డు డేట్‌ ఇదే.. త్వరపడండి!

SBI Q4 Result: బంపర్‌ డివిడెండ్‌ ప్రకటించిన ఎస్‌బీఐ! రికార్డు డేట్‌ ఇదే.. త్వరపడండి!

టాప్ స్టోరీస్

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం,  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా