By: ABP Desam | Updated at : 12 Nov 2021 06:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పేటీఎం
ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవోకు రానుంది పేటీఎం. మరో వారం రోజుల్లో కంపెనీ షేర్ మార్కెట్లో నమోదు అవుతోంది. కొన్నేళ్ల క్రితం వెయ్యి మంది ఉద్యోగులతో చిన్న స్టార్టప్‌గా మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు పదివేల మందికి పైగా పనిచేస్తున్నారు. కొందరు వేరే కంపెనీలకు వెళ్లిపోయారు. అయితే అందులో 350కి పైగా ఉద్యోగులు ఇప్పుడు కోటీశ్వరులు అవుతున్నారు.
పేటీఎం రూ.18,300 కోట్లతో ఐపీవోకు వస్తోంది. అందులో ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10,000 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. మిగతావి రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ చేస్తోంది. ఒక్కో షేరు ధర రూ.2150గా ఉంది. ఈ ఐపీవోతో పేటీఎంలో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన 350 మంది లక్ష నుంచి పది లక్షల డాలర్ల వరకు అధిపతులు కాబోతున్నారు. దాంతో వారంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం సిద్దార్థ్ పాండే అనే ఎలక్ట్రానిక్ ఇంజినీర్ పేటీఎంలో ఉద్యోగిగా చేరాడు. ఓ చిన్న స్టార్టప్‌లో చేరుతోంటే తండ్రి అతడిని వారించాడు. 'పేటైమా.. అదేం కంపెనీ' అని అన్నాడు. ఏడేళ్లు అందులో ఉన్న పాండే ఇప్పుడు మరో స్టార్టప్‌లో పనిచేస్తున్నారు. కానీ పేటీఎంలో అప్పుడు ఇచ్చిన కొన్ని వేల షేర్లను మాత్రం అలాగే తన వద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు వాటి విలువ మిలియన్ డాలర్లకు పైగా ఉంది.
'మా నాన్న అప్పుట్లో నన్ను నిరుత్సాహ పరుస్తుండేవాడు. ఏంటదీ? పేటైమా? అనేవాడు. అందరికీ తెలిసిన కంపెనీలో పనిచేయాలని ఒత్తిడి చేసేవాడు. కానీ ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నాడు. కోటీశ్వరుడిని అయ్యానని తెలిసి మరింత అణకువగా ఉండాలని సూచించాడు' అని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పాండే గుర్తు చేసుకుంటున్నాడు. ఈ సంతోషంలో రూ.4 లక్షలు ఖర్చుచేసి తన తండ్రిని ఉదయ్‌పుర్‌లో ఐదు రోజుల విహారయాత్రకు తీసుకెళ్లానని చెబుతున్నాడు.
'పేటీఎం ఎప్పుడూ ఉదారంగా డబ్బులిస్తుంది. విజయ్ (పేటీఎం ఫౌండర్) ఎప్పుడూ ప్రజలు డబ్బు సంపాదించాలని కోరుకునేవాడు' అని పాండే అంటున్నాడు. పేటీఎం ఐపీవో ద్వారా వచ్చే డబ్బులో కొంత భాగాన్ని రిటైర్మెంట్ ఫండ్‌కు మళ్లిస్తానని, పిల్లల చదువులకు ఉపయోగిస్తానని సంతోషంగా చెబుతున్నాడు.
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్
Also Read: Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్.. ఎందుకంటే?
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Buying Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? మొదట ఇన్‌కం టాక్స్ రూల్స్ తెలుసుకోండి
Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!
LIC Home Loan: తక్కువ వడ్డీకి హోమ్ లోన్ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!