Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
ఏం వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సలహా మీకోసమే. ఈ వ్యాపారంతో భారీ లాభాలు వస్తాయి.
ఏదైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసమే. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే అద్భుతమైన సలహా ఏంటో మీరే చూసేయండి. ఇలా చేస్తే నెలకు రూ.2 లక్షల వరకు మీకు లాభం వచ్చే అవకాశం ఉంది.
గొర్రెల వ్యాపారం..
గొర్రెలు, మేకల వ్యాపారం ప్రస్తుతం చాలా బాగా నడుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా తక్కువ మొత్తం పెట్టుబడిలో ఎక్కువ లాభం వస్తోంది. ప్రస్తుతం గొర్రెల పెంపకం ద్వారా ఎంతోమంది లాభాలు గడిస్తున్నారు.
ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారం ప్రారంభించుకునే సౌకర్యం ఉండటం కలిసొచ్చే విషయం. దేశానికి ఆర్థికం, షోషకాహారం అందించడంలో ఈ వ్యాపారం ముఖ్య భూమిక పోషిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంది. చాలా మంది దీనిపైనే ఆధారపడుతున్నారు. గొర్రెల పెంపకం ద్వారా పాలు, ఎరువు కూడా లభిస్తుంది.
ప్రభుత్వ సాయం..
గొర్రెల పెంపకం వ్యాపారానికి పెద్ద ఎర్పాట్లు ఏం అవసరం లేదు. ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తోంది. పశుషోషణను పెంపొందించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల యజమానులకు 90 శాతం సబ్సిడీ ఇస్తోంది హరియాణా సర్కార్. ఇతర రాష్ట్రాల్లోను ఇలాంటి సబ్సిడీలు ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పశుపోషణకు 35 శాతం సబ్సిడీ ఇస్తోంది.
డబ్బులు లేవా?
ఒక వేళ గొర్రెల పెంపకం ప్రారంభించేందుకు డబ్బులు లేకపోయినా ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే బ్యాంకులు ఇందుకోసం రుణాలు ఇస్తున్నాయి. నాబార్డ్ కూడా గొర్రెల పెంపకానికి రుణాలు ఇస్తోంది.
ఇవి గుర్తుంచుకోండి..
ఈ వ్యాపారం ప్రారంభించాలంటే కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. లొకేషన్, మేత, నీరు, ఎంతమంది పనివాళ్లు కావాలి, పశువుల వైద్య సాయం, మార్కెట్ ఎలా ఉంది, ఎగుమతి విధానాలు ఇలాంటి వాటిపై పూర్తి సమాచారం సేకరించాలి. పలు ప్రమాదకర రోగాలపై శరీరం శక్తిమంతంగా పోరాటం చేసేందుకు మేక పాలు చాలా ఉపయోగకరమని ఇప్పటికే తేలింది. రోగనిరోధక శక్తిని కూడా మేక పాలు పెంచుతాయి. మేక మాంసానికి కూడా పెద్ద డిమాండ్ ఉంది. దేశీయంగా మేక మాంసం తినేవాళ్లు కూడా అధికంగా ఉన్నారు. అయితే ఇదేమీ కొత్త బిజినెస్ ఏం కాదు. పూర్వ కాలం నుంచి కూడా గొర్రెల పెంపకం మన జీవనంలో భాగమే.
లాభాలు..
లాభాల విషయానికొస్తే గొర్రెల వ్యాపారంలో సగటున 18 ఆడ మేకలపై రూ.2,16,000లు లాభం వస్తుంది. మగ మేకలపై సగటున రూ.1,98,000లు లాభం వస్తుంది.
ముఖ్య గమనిక: వ్యాపార నిపుణులు, పలువురు వ్యాపారులు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also read: Srinagar Encounter: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి