By: ABP Desam | Updated at : 11 Nov 2021 01:02 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు అని మనం అనుకుంటాం... కానీ, పెళ్లంటే బోలెడంత ఖర్చు, ఆ ఖర్చు భరించడం మనకి అవసరమా అని ఆలోచించేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి పిసినారి బ్యాచ్‌కి చెందిన వ్యక్తి ఈ పెళ్లి కూతురు. ఆమె అమెరికాలో నివసిస్తోంది. ఆ పెళ్లికూతురు పేరు బయట పెట్టకుండా ఆమె స్నేహితురాలు... తన పిసినారి ఫ్రెండ్ గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్టు వైరల్ అవ్వడంతో పాటూ, ఆ పెళ్లికూతురు గురించి ఆరా తీసే వాళ్లు ఎక్కువైపోయారు.
ఆ పెళ్లికూతురు చాలా ఏళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోంది. ఫలితంగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చక్కటి ఇల్లు కూడా కొనుక్కుంది. సహజీవనాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి కూతురు తన స్నేహితురాలు ఒకరికి ఇన్విటేషన్ పంపింది. ఆ ఆహ్వానం చూసి స్నేహితురాలికి దిమ్మతిరిగింది. ‘మా పెళ్లికి రండి. వివాహభోజనాలు ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత మాకు లేదు. అందుకే 99 డాలర్లు చెల్లించి, పెళ్లి భోజనాలు కొనుక్కోవాలని కోరుకుంటున్నాం’ అని రాసి ఉంది. అది చూసి పెళ్లి కూతురి ఫ్రెండ్ కి చిర్రెత్తుకొచ్చింది. ఇంత కన్నా ఛండాలం ఉంటుందా అంటూ ఆ ఇన్విటేషన్ ను అమెరికాకు చెందిన సోషల్ మాధ్యమం రెడ్డిట్ లో పోస్టు చేసింది. దాన్ని మరింత మంది నెటిజన్లు చూసి మండిపడ్డారు. ‘ఇదేం బుద్ధి, పెళ్లికి పిలిచి భోజనాలు కొనుక్కోమని చెబుతుందా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
99డాలర్లంటే మన రూపాయల్లో రూ.7,300. ఇంత ఖర్చుపెట్టి చక్కగా ఏ రెస్టారెంట్లోనో హ్యాపీగా నచ్చినవి తినటం మేలని చాలా మంది ఆ పెళ్లికి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. అందులోనూ పిల్లలను తీసుకురాకూడదనే కండిషన్ కూడా ఉంది. అంతేకాదు పెళ్లిలో తమ హనీమూన్ కోసం విరాళం సేకరించే బాక్సు కూడా పెట్టింది ఆ పెళ్లికూతురు. పెళ్లి భోజనం ఉచితంగా పెట్టకపోగా, కానుకలు మాత్రం స్వీకరించడానికి సిద్ధపడిపోయింది. ఇంతకన్నా అధ్వానమైన పెళ్లి ఎక్కడా జరిగుండదంటూ ఆడేసుకుంటున్నారు ట్రోలర్లు.
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
Also read: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది
Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే
Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో
Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?
Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్
Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన
లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!
Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు