కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
విరాట్ కోహ్లీ డకౌట్ల పరంపర కంటిన్యూ అవుతోంది. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో డకౌట్ అయి ఫ్యాన్స్‌కి షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో . అచ్చొచ్చిన అడిలైడ్ మైదానంలో అయినా విరాట్ సెంచరీ చేస్తాడని.. ఫ్యాన్స్ ఎదురుచూస్తే.. అక్కడ కూడా డకౌట్ అయి తట్టుకోలేని హార్ట్ బ్రేక్ మిగిల్చాడు. ఫస్ట్ మ్యాచ్‌లో 8 బంతులాడిన విరాట్ కోహ్లీ.. స్టార్ట్ బైలింగ్‌లో అవుట్‌సైడ్ బాల్‌ని స్లిప్స్, పాయింట్స్ దిశగా ఆడటానికి ప్రయత్నించి.. డీప్ పాయింట్లో కానొలీకి క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయిన విరాట్.. రెండో వన్డేలో 4 బంతులాడి.. మళ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా డకౌటయ్యాడు.
ఈ డకౌట్‌తో విరాట్ కోహ్లీ ఇండియా తరపున అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా 40 సార్లు డకౌట్ అయిన ఇషాంత్ శర్మ రికార్డ్‌ని ఈక్వల్ చేశాడు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో విరాట్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టాప్‌లో జహీర్ ఖాన్ 43 డక్ అవుట్లతో టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అవడంతో.. అతడిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది.
విరాట్ డకౌట్ అవుతున్న స్పీడ్ చూస్తుంటే.. అతి త్వరలో జహీర్ రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడంటూ ఆడుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఇండియాకి స్టార్టింగ్‌లోనే కెప్టెన్ గిల్ 9 రన్స్ చేసి అవుటవ్వడంతో పెద్ద దెబ్బ తగిలింది. ఆ వెంటనే కోహ్లీ కూడా డకౌట్ కావడంతో 7 ఓవర్లలో 17 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.





















