అన్వేషించండి

Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..

Kurnool bus Fire Accident: కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ మంటల్లో కాలిపోవడంతో 20 మంది వరకు చనిపోగా, ప్రమాదానికి కారణాలేంటని అధికారులు ఆరా తీస్తున్నారు.

కర్నూలు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో కాలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది వరకు సజీవ దహనం అయ్యారని సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహన మయ్యారు. 12 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది.

ప్రమాదానికి కారణమేంటి..

హైదరాబాద్ నుంచి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. మార్గం మధ్యలో నేషనల్ హైవే 44పై కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బైకును ఢీకొట్టింది. ఆ టూవీలర్ బస్సు కిందికి దూసుకెళ్లి ఫ్యూయల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాప్తిచెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..

కొందరు ప్రయాణికులు లేచి చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకి స్వల్ప గాయాలతో బటయపడ్డారు. దాదాపు 12 మంది ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. స్థానికుల సహాయంలో పోలీసులు, రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలే తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. దాంతో అసలేం జరిగిందో వారికి తెలిసే లోపే ప్రాణాలు కోల్పోయారని అధికారులు, రెస్క్యూ టీమ్ తెలిపారు.

Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..

డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోవడంతో..

కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బైక్‌ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని.. దాంతో ప్రయాణికులు డోర్ తెరవడం సాధ్యం కాలేదని తెలిపారు.  ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశామన్నారు. అయితే ప్రమాదంలో  20 మంది ప్రయాణికులు మిస్‌ అయ్యారు, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని తెలిపారు. ఈ ఘటనలో  20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ సిరి వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్‌ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
2026 Hero Xtreme 160R షోరూమ్‌లలోకి ముందే వచ్చేసింది - కొత్త ఫీచర్లు, కొత్త అటిట్యూడ్‌
US Shutdown: ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
Embed widget