Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? అని అడిగితే.. మనందరం జవహర్‌లాల్ నెహ్రూ అని చెప్తాం.. కానీ నెహ్రూ కాదు.. స్వతంత్ర భారతదేశ ప్రభుత్వానికి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నేనంటే.. అవును మొట్టమొదటి స్వాతంత్ర భారతదేశ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసే. కానీ అదెలా? పదండి ఈ రోజు ఇండియా మాటర్స్‌లో తెలుసుకుందాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు చెబితేనే భారతీయుల గుండెల్లో దేశ భక్తి ఉప్పొంగుతుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ ఫైట్‌లో ఓ అన్‌సంగ్ హీరోగా.. ఆఖరి శ్వాస వరకు భరతభూమి కోసం పోరాడిన వీరుడిగా ప్రతి భారతీయుడి మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు నేతాజీ. తన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో బ్రిటిషర్ల గద్దెని కదిలించి.. భారతదేశానికి స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపిరులూదారు. కేవలం ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిషర్లతో పోరాడటమే కాదు.. బ్రిటిషర్లకి కౌంటర్‌గా మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చేసింది కూడా నేతాజీనే. ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రితో పాటు.. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను కూడా నేతాజీనే నిర్వహించారు. ఇంకో విషయం తెలుసా? ఈ ప్రభుత్వాన్ని నేతాజీ ఏర్పాటు చేసింది అక్టోబర్‌లోనే.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. 1942లో సింగపూర్‌లో కెప్టెన్ మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు, కానీ తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యానికి నాయకుడిగా మారారు. ఈ ఆర్మీ మెయిన్ టార్గెట్ భారతదేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి ప్రసాదించి.. బ్రిటిష్ పాలనను తరిమికొట్టడమే. ఈ సైన్యంలో “రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్” అనే మహిళా రెజిమెంట్‌తో సహా దాదాపు 85 వేల మంది భారతీయ సైనికులు ఉండేవారు.
ఆజాద్ హింద్ ఫౌజ్‌కి జపాన్ భారీగా మద్దతిచ్చింది. జపాన్ సపోర్ట్‌తోనే అక్టోబర్ 21, 1943న నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని కూడా స్థాపించారు. దీనిని అనేక దేశాలు కూడా గుర్తించాయి. INA మయన్మార్, ఇంఫాల్ సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. చివరికి ఈ సైన్యం యుద్ధంలో ఓడిపోయినా.. ఆజాద్ హింద్ ఫౌజ్ త్యాగం, ధైర్యం భారతీయ ప్రజలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం గద్దె ఈ సైన్యం దెబ్బకు కదలింది అంటే నేతాజీ సైన్యం చేసిన పోరాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సైన్యం పోరాటమే స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికీ నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని దేశభక్తి, ధైర్యానికి చిహ్నాలుగా భారతీయులంతా చెప్పుకుంటారు. అంతేకాదు.. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నడిపే టైంలో.. నేతాజీ ఇచ్చిన “జై హింద్”, “నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను” వంటి నినాదాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నినాదాలు ఇప్పటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయి.
ఏది ఏమైనా.. భారతదేశ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్టోబర్ 21నే. అది సింగపూర్‌లో నేతాజీ ఏర్పాటు చేసి.. దానికి నేతాజీ ప్రధానిగా ఉన్నారు. అందుకే అక్టోబర్ 21 భారతీయులకి అంత ఇంపార్టెంట్. సో.. ఇది ఇవ్వాళ్టి ఇండియా మాటర్స్. మరి నెక్ట్స్ వీక్ ఇంకో వీడియోతో మీముందుకొస్తాను. అప్పటి వరకు జైహింద్.





















