KTM RC 160 - Yamaha R15 మధ్య కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? తేడాలను కేవలం 2 నిమిషాల్లో తెలుసుకోండి
కొత్తగా లాంచ్ అయిన KTM RC 160 & Yamaha R15 మధ్య ధర, ఇంజిన్, పవర్, బరువు, ఫీచర్లలో ఉన్న ప్రధాన తేడాలు ఈ కథనంలో తెలుసుకోండి.

KTM RC 160 Launch Price And Specifications: స్పోర్టీ లుక్, అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్, ట్రాక్ ఫీలింగ్ కావాలనుకునే యువతలో Yamaha R15కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పుడు అదే సెగ్మెంట్‌లో KTM కొత్తగా RC 160ను లాంచ్ చేయడంతో పోటీ మరింత హీటెక్కింది. 160 Duke ఇంజిన్‌ను RC 200 ఫేరింగ్‌లో అమర్చి తీసుకొచ్చిన ఈ బైక్, KTM RC ఫ్యామిలీలో ఎంట్రీ మోడల్‌గా నిలిచింది. ఇంతకు ముందున్న RC 125ను ఇది పూర్తిగా రీప్లేస్ చేస్తోంది. మరి ఈ కొత్త RC 160, మార్కెట్‌లో చాలా కాలంగా ఉన్న Yamaha R15కి ఎంత వరకు పోటీ ఇస్తుంది? ఇప్పుడు వివరంగా అర్ధం చేసుకుందాం.
ఇంజిన్ & పవర్ అవుట్‌పుట్
| | KTM RC 160 | Yamaha R15 |
| ఇంజిన్ | 164.2cc, single-cyl, liquid-cooled | 155cc, single-cyl, liquid-cooled |
| పవర్ | 19hp at 9,500rpm | 18.4hp at 10,000rpm |
| టార్క్ | 15.5Nm at 7,500rpm | 14.2Nm at 7,500rpm |
| గేర్‌బాక్స్ | 6-speed | 6-speed |
| పవర్-టు-వెయిట్ రేషియో | 122.5hp/tonne | 130.5hp/tonne |
KTM RC 160లో 160 Duke ఆధారంగా తయారైన శక్తిమంతమైన ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ బైక్, Yamaha R15తో పోలిస్తే ఎక్కువ పీక్ పవర్, ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే RC 160కి ప్రధాన బలం. ఇంతకుముందు RC 125లో ఈ లోటు స్పష్టంగా కనిపించేది.
అయితే Yamaha R15లో ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ తక్కువ అయినప్పటికీ, పవర్ టు వెయిట్ రేషియో మెరుగ్గా ఉంటుంది. కారణం, R15 తక్కువ కర్బ్ వెయిట్. రెండు బైక్‌లు కూడా ఒకే RPM వద్ద పీక్ టార్క్ ఇస్తాయి. అయితే RC 160 పీక్ పవర్‌ను కొంచెం తక్కువ RPM వద్దనే అందిస్తుంది. దీని వల్ల సిటీ & ట్రాక్ డ్రైవింగ్‌లో పవర్ డెలివరీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది.
బరువు & డైమెన్షన్స్
ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడా బరువులోనే కనిపిస్తుంది. Yamaha R15 తక్కువ కర్బ్ వెయిట్‌తో వస్తుంది. KTM RC 160 మాత్రం R15తో పోలిస్తే సుమారు 14 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. RC 160 కర్బ్ వెయిట్ 155 కిలోలు కాగా, ఇది 160 Duke కంటే కూడా 8 కిలోలు ఎక్కువ. అయితే RC 160లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. R15 సీట్ హైట్ RC 160 కంటే 15mm తక్కువగా ఉండటం వల్ల, కాస్త ఎత్తు తక్కువ రైడర్లకు Yamaha బైక్ మరింత సౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. రెండు బైక్‌లలోనూ రైడింగ్ ట్రయాంగిల్ చాలా స్పోర్టీగా, కమిటెడ్‌గా ఉంటుంది.
టైర్లు, సస్పెన్షన్, బ్రేక్స్
టైర్ల విషయంలో పెద్ద తేడా లేదు. రెండు బైక్‌లలోనూ ముందు భాగంలో MRF Zapper, వెనుక భాగంలో MRF Revz రేడియల్ టైర్‌ను ఉపయోగించారు. అయితే KTM RC 160లో ముందు టైర్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, RC 160లో ముందు డిస్క్ బ్రేక్ సైజ్ కూడా పెద్దది. ఇది బైక్ బరువు ఎక్కువగా ఉండటానికి అనుగుణంగా ఇచ్చిన సెటప్. ఈ విషయంలో KTM కొంచెం స్పోర్టీ అప్రోచ్ తీసుకుంది.
ఫీచర్లు
Yamaha R15 ఫీచర్ల విషయంలో ముందంజలో ఉంటుంది. ఇది ఎక్కువ వేరియంట్లలో లభిస్తుంది. R15 V4లో LCD డిస్‌ప్లే ఉన్నప్పటికీ, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. వైట్ కలర్ ఆప్షన్‌లో క్విక్‌షిఫ్టర్‌ను యాక్సెసరీగా అందిస్తున్నారు. అయితే టాప్ వేరియంట్ అయిన R15Mలో మాత్రం TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది R1M స్టైల్ లేఅవుట్‌తో వస్తుంది. ఈ వేరియంట్‌లో క్విక్‌షిఫ్టర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.
KTM RC 160 మాత్రం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో TFT డిస్‌ప్లే లేదు. LCD యూనిట్‌తోనే సరిపెట్టుకోవాలి, అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో స్విచ్ చేయగల రియర్ ABS, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. రెండు బైక్‌లలోనూ LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ స్టాండర్డ్‌గా వస్తాయి.
ధర
ధర విషయానికి వస్తే Yamaha R15 బేస్ వేరియంట్ స్పష్టంగా తక్కువ ధరలో లభిస్తుంది.
KTM RC 160 ఎక్స్-షోరూమ్ ధర: ₹1.85 లక్షలు
Yamaha R15 ఎక్స్-షోరూమ్ ధర: ₹1.66 లక్షల నుంచి ₹1.91 లక్షల వరకు
ఏది బెస్ట్?
ఎక్కువ పవర్, అగ్రెసివ్ లుక్, KTM బ్రాండ్ ఫీల్ కావాలంటే RC 160 మీకు సరైన ఎంపిక. తక్కువ బరువు, మెరుగైన ఫీచర్లు, TFT డిస్‌ప్లే, క్విక్‌షిఫ్టర్ కావాలంటే Yamaha R15, ముఖ్యంగా R15M వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తుంది. మీ రైడింగ్ స్టైల్, బడ్జెట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















