అన్వేషించండి

Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం

స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh Latest News: భయపెడుతున్న స్క్రబ్ టైఫస్‌ జ్వరాలపై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని అన్నారు. స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. 

ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని... వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని... ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిశాలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. 

ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగీ కేసులు రాగా...ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగీ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గతేడాది 7,871 మంది మలేరియా బారినపడగా ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా...ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు అధికారులు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 

అపరిశుభ్రతే అసలు జబ్బు: చంద్రబాబు

సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Somireddy Chandramohan Reddy: ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి
ప్రధానుల కేసులే మూడేళ్లలో తేల్చారు- జగన్ కేసుల్లో రోజువారీ కాదు.. రోజంతా విచారణ జరగాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget