IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Crying: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి

మగాళ్లు ఏడవకూడదు, ఏడ్చేవాడు మగాడు కాదు... ఇలాంటి నానుడి సమాజంలో నానిపోయి ఉంది.

FOLLOW US: 

మగాళ్లు ఏడవకూడదు, ఎప్పుడూ సింహంలా గంభీరంగా కనిపించాలి... అదే మగతనమంటే. భావోద్వేగాలను బయటపెట్టుకున్నా, బాధ కలిగినప్పుడు కన్నీరు పెట్టుకున్నా అదో తప్పులాగా ‘ఆడపిల్లలా ఏడుస్తున్నాడు’అంటూ సమాజం నుంచి కామెంట్లు వినిపిస్తాయి. పురుషులు ఏడవకూడదు, ఆడవాళ్లు మాత్రమే ఏడుపుకు అర్హులు అని ఎవరు చెప్పారు? భారత రాజ్యాంగంలో రాశారా? లేక మన ప్రధాన మతగ్రంథాలు చెప్పాయా?  

వేదనతో మనసు నలిగిపోయినప్పుడు భరించలేని బాధ కలగడం సహజం. అలాంటప్పుడు దేవుడు మనకిచ్చిన వరం ‘ఏడుపు’. మనస్పూర్తిగా ఏడిస్తే ఎంత బాధైన ‘ఉఫ్’మని ఊదినట్టు మనసు నుంచి పోతుంది. ఆ బాధను తట్టుకునే శక్తి వస్తుంది. కానీ చాలా మంది మగాళ్లు ఏడవరు. ఆ బాధను పక్కవాళ్లతో పంచుకోరు.మనసు నిండా నింపేసుకుని భారంతో కుంగిపోతారు. ఏడవకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని, స్వీయ ఆంక్షల చట్రంలో తమకు తామే కీడు చేసుకుంటారు. ఈ విషయాన్ని చెబుతోంది మేము కాదు, మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మానసిక వేదన కలిగినప్పుడు ఏడవని, తమ బాధలను పక్కవాళ్లతో పంచుకోని మగవారు చివరికి ఏకాకులుగా మిగిలిపోతారని వారు చేసిన కొత్త అధ్యయనంలో తేలింది. దాదాపు 5500 మంది మగాళ్లపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంతేకాదు ఇలాంటి పురుషులు త్వరగా మానిసక సమస్యల బారిన పడతారని కూడా అధ్యయనం చెబుతోంది. 

ఏడుపు చాలా ముఖ్యం?
నవ్వు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, ఏడుపు కూడా అంతే ముఖ్యం అని చెబుతున్నారు పరిశోధకులు. మానసిక భావాలకు ప్రతిస్పందించి, కన్నీటి గ్రంథులు నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. అవి కళ్ల ద్వారా బయటికి వస్తాయి. ఇదంతా మన శరీర ఫంక్షనింగ్ లో భాగమే. బాధ కలిగినప్పుడు ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే ఏడ్చాక మనసు రిలీఫ్ గా ఉంటుంది. బాధ నుంచి బయట పడినట్టు అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. 

ఆత్మహత్యలు చేసుకునేది వీళ్లే
ఏడవడం అంటే స్వీయ ఓదార్పును పొందడమే. కానీ మగాళ్లు ఆ ఓదార్పును పొందడం లేదు. యూకేలో జరిగిన ఓ సర్వేలో 55 శాతం మంది మగవారు... ఏడిస్తే తాము మగవాళ్లం కాదని అంటారేమోనని భయపడుతున్నారు. అందుకే వస్తున్న ఏడుపును కూడా బలవంతంగా ఆపేసుకుని, గంభీరంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.  ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారిలో ఎక్కువమంది మగవారే. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: ఫుడ్ ప్యాకింగ్ లేబుళ్లపై ఇలా రాసి ఉంటే కొనే ముందు ఆలోచించండి, ఎందుకంటే...

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు

Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే

Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 08:02 AM (IST) Tags: Crying Men Crying Crying Benefits New study on Crying ఏడుపు

సంబంధిత కథనాలు

Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు

Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

టాప్ స్టోరీస్

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!

MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్‌ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్‌!