News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!

బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. దీని నియంత్రణ, ఇతర అంశాల గురించి ప్రధాని మోదీ అధ్యక్షతన ఓ అత్యున్నత సమావేశం జరిగింది. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

FOLLOW US: 
Share:

క్రిప్టో కరెన్సీపై శనివారం జరిగిన అత్యున్నత సమావేశానికి ప్రధాన నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. నియంత్రణలో లేని ఈ విపణి అక్రమ నగదు బదిలీ, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక దన్నుగా మారకుండా అడ్డుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలను ట్రేడ్‌ చేస్తుండటంతో మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలన్నారు. ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారని పీటీఐ తెలిపింది.

యువతను తప్పుదారి పట్టించేలా అసత్య హామీలు ఇవ్వడం, పారదర్శకత లేని ప్రకటనలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చించారని తెలిసింది. క్రిప్టో కరెన్సీలపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారని సమాచారం.

'ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంకేతికత దూసుకుపోతుందని ప్రభుత్వానికి తెలుసు. క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోంది. అవసరమైన చర్యలు తీసుకోనుంది. క్రిప్టో ట్రేడింగ్‌కు ఊతం ఇచ్చేలా, ప్రగతిశీలంగా ప్రభుత్వ చర్యలు ఉండాలన్న ఆలోచనను అందరూ స్వాగతించారు' అని పీటీఐ తెలిపింది.

క్రిప్టో కరెన్సీ నిపుణులు, స్టేక్‌ హోల్డర్లతో ప్రభుత్వం చురుగ్గా చర్చలు జరపనుందని తెలుస్తోంది. దేశాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ జరుగుతుండటంతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని, సమన్వయంతో వ్యూహాలు రచించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

ఆర్‌బీఐ, ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలతో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రపంచంలోని ఇతర దేశాలు, అనుభవజ్ఞులు, నిపుణులతో ఇప్పటికే సంప్రదించారని, వారిచ్చిన సమాచారం ఆధారంగానే సమావేశం నిర్వహించారని తెలిసింది. అలాగే అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలించారని పీటీఐ తెలిపింది. కాగా క్రిప్టో కరెన్సీలు ఏ ఆర్థిక వ్యవస్థకైనా ప్రమాదకరమేనని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Also Read: SBI Credit Card ALERT : ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు షాక్‌! ఇకపై ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న సంస్థ

Also Read: MobiKwik RuPay Card: మొబిక్విక్‌ రూపే కార్డు.. ముందే రూ.30వేలు వాడేసుకోవచ్చు..! మరెన్నో ఆఫర్లు..!

Also Read: PM Modi Launches RBI Schemes: రెండు కొత్త పథకాలు ఆరంభించిన ప్రధాని మోదీ.. ఆర్‌బీఐ పరిధిలోని ఈ 2 స్కీములతో ప్రజలకు లాభాలివే!

Also Read: Multibagger stock: ఈ ఐటీ స్టాక్‌ 18 నెలల్లో లక్షకు రూ.16.65 లక్షల రాబడి ఇచ్చింది.. ఏం కంపెనీయో తెలుసా?

Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 12:45 PM (IST) Tags: PM Modi rbi PM Narendra Modi FInance Ministry cryptocurrency Terror Financing Activities bit coin

ఇవి కూడా చూడండి

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Ambani Children Salary: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

Ambani Children Salary: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

2000 Rupee Notes: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

2000 Rupee Notes: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

Latest Gold-Silver Price 27 September 2023: భలే ఛాన్సులే - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 27 September 2023: భలే ఛాన్సులే - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు