News
News
X

IND vs NZ: మరో చరిత్రకు నాంది! కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ మొదటి సిరీస్‌.. కివీస్‌తో నేడే ఢీ!

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా నియామకం అయ్యారు. వారి నేతృత్వంలో భారత్ నేడే తొలి టీ20 ఆడబోతోంది.

FOLLOW US: 
Share:

ప్రపంచకప్‌ ముగిసి వారమైనా కాలేదు మళ్లీ పొట్టి క్రికెట్‌ మజా మొదలవుతోంది! ప్రియమైన శత్రువు న్యూజిలాండ్‌ మన దేశంలో పర్యటిస్తోంది. మూడు మ్యాచుల్లో భాగంగా తొలి టీ20ని జైపుర్‌ సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో ఆడుతోంది. మరి ఈ సిరీస్‌ ప్రత్యకతేంటి? బలాబలాలు ఎలా ఉన్నాయి?

ప్రత్యేకత ఏంటి?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా నియామకం అయ్యారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదో నవోధ్యాయం కానుంది. వ్యక్తి, క్రికెటర్‌, కోచ్‌గా ద్రవిడ్‌కు మంచి పేరుంది. పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్‌కు అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబయిని అతడు ఐదుసార్లు గెలిపించాడు. పైగా మరో 11 నెలల్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ఇది అంకురార్పణ!

ఆధిపత్యం ఎవరిది?

 • టీ20ల్లో ఈ రెండు జట్లు 17 సార్లు తలపడ్డాయి.
 • కివీస్‌ 9 మ్యాచులు గెలిచింది.
 • భారత్‌ 6 గెలిచింది.
 • రెండింట్లో ఫలితం తేలలేదు.
 • ఉపఖండంలో మాత్రం టీమ్‌ఇండియాదే పైచేయి.

భారత్‌ బలాలేంటి?

 • రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కావడం. ద్రవిడ్‌ కోచ్‌గా రావడం.
 • కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటం.
 • వెంకటేశ్ అయ్యర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హార్దిక్‌ పాండ్య స్థానాన్ని అతడి భర్తీ చేయనున్నాడు.
 • ఫియర్‌లెస్‌ క్రికెట్‌ వైపు అడుగులు వేస్తామని ద్రవిడ్‌ ప్రకటించడం.
 • రాహుల్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యం.
 • సూర్య, శ్రేయస్‌, ఇషాన్‌, రుతురాజ్‌, పంత్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండటం.
 • భువీ, అక్షర్‌, సిరాజ్‌, యూజీ, అశ్విన్‌తో బౌలింగ్‌ బలంగా ఉండటం.
 • సొంత దేశంలో ఆడుతుండటం.

భారత్‌ బలహీనతలు?

 • విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమి అందుబాటులో లేకపోవడం.
 • కుర్రాళ్లు, సీనియర్లతో కూర్పు సులువు కాదు.
 • మొదట బ్యాటింగ్‌లో తక్కువ స్కోరు చేయడం.
 • చాలామందిపై బుడగ ఒత్తిడి ఉండటం.
 • కుర్రాళ్లు ఒత్తిడిని ఏ మేరకు అధిగమిస్తారో తెలియదు.
 • ఐపీఎల్‌ నుంచి నేరుగా ఎంపికవ్వడం.

కివీస్‌ ఎలా ఉందంటే?

ఇక న్యూజిలాండ్‌ పరిస్థితీ టీమ్‌ఇండియాలాగే ఉంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరికీ భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌కు టీమ్‌ఇండియాపై మంచి సగటు ఉంది. గప్తిల్‌కూ మన బౌలర్లపై ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌ను బాగా ఎదుర్కొనే డేవాన్‌ కాన్వే లేకపోవడం కివీస్‌ లోటు. సమష్టిగా ఆడటం కివీస్‌ బలం. కొన్నేళ్లుగా ఆ జట్టుకు రెగ్యులర్‌గా 20-25 మందిని ఆడిస్తోంది. జిమ్మీ నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, ఫెర్గూసన్‌, సోధికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది.

మంచు కీలకం?

పిచ్‌ బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. పెద్ద మైదానం కావడంతో స్పిన్నర్లు వికెట్లు తీసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్‌ బౌలర్ల కన్నా స్పిన్నర్ల సగటు, ఎకానమీ మెరుగ్గా ఉంది. పేసర్లు చక్కని బంతులు వేసేందుకు పరిస్థితులు బాగుంటాయి. ఎడారి ప్రాంతం కావడంతో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Published at : 17 Nov 2021 10:27 AM (IST) Tags: Rohit Sharma KL Rahul India New Zealand TIM SOUTHEE Jaipur Rahul Dravid Ind Vs NZ T20I

సంబంధిత కథనాలు

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

Suryakumar Yadav: సూర్యకుమార్‌ 3 వన్డేల్లో 3 డక్స్‌! మర్చిపోతే మంచిదన్న సన్నీ!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ