Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABP
ఆదివాసుల ఆత్మబంధువు, మానవ పరిణామాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి కార్యక్రమాన్ని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి ప్రజా ప్రతినిధులు, స్థానిక జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పిఓ, ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొని డార్ఫ్ దంపతుల యొక్క సమాధుల వద్ద నివాళులు అర్పించి స్మరించుకున్నారు. అనంతరం వర్ధంతి సభ నిర్వహించుకుని వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చేసిన సేవల గురించి అందరూ తమదైన శైలిలో వివరించారు. హైమన్ డార్ఫ్ దంపతుల జ్ఞాపికలను అప్పటి కాలంలో తీసిన ఛాయ చిత్రాలను, డార్ఫ్ యొక్క మ్యూజియాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఛాయ చిత్ర ప్రదర్శనను అందరికీ తెలిసేలా ఏర్పాటు చేశారు. ఈ ఛాయ చిత్ర ప్రదర్శనలో పలువురు ఈ ఛాయ చిత్ర ప్రదర్శనలో చూసిన ఫోటోలు హైమన్ డార్ఫ్ తో పాటు ఆదివాసీల పూర్వ చరిత్ర గురించి ఏబీపీ దేశంతో మాట్లాడారు. అలాగే ఆదిలాబాద్ ఆకాశవాణి రేడియో కేంద్రం రిటైర్డ్ అధికారి సుమనస్పతి రెడ్డి ఆయన తీసిన ఛాయ చిత్రాలు, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల గురించి ఆయనకు తెలిసిన అనుభవాలను ఏబిపీ దేశంతో ఎక్స్ క్లుజివ్ గా వివరించారు. ఆ విశేషాలు ఏంటో ఈ స్టోరి లో చూద్దాం.





















