Khanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP Desam
ఆదివాసీల ఆత్మ బంధువు, మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతిని మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీలపై అధ్యయనం చేయడానికి లండన్ నుంచీ మార్లవాయి గ్రామానికీ వచ్చి.. ఆదివాసీలతో కలిసి నివాసముంటూ ఆదివాసీలలో ఒకరిగా మమేకమయ్యారు. చివరికి వారి మరణాంతరం ఇక్కడే సమాధి చేయబడ్డారు. వారు చేసిన సేవలతో ఆదివాసులకు అనేక హక్కులు చట్టాలు కల్పించబడ్డాయి. అందుకే ప్రతి ఏటా ఈ పుణ్య దంపతుల వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ పెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతి కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు,తో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఆదివాసి సంఘాల నాయకులు స్థానిక గ్రామస్తులు పాల్గొని డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద ఆదివాసి సాంప్రదాయాలతో నివాళులు అర్పించి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఇంతకీ ఆదివాసుల కోసం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ చేసిన సేవలు ఏంటి..? హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి వేడుకలను ఆదివాసీలు ప్రతియేటా ఎలా..? ఎందుకు జరుపుకుంటున్నారు..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆదివాసులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఏం చర్చించారు..? ఆదివాసీలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు..? ఈ అంశాలపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.





















