Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Makar Sankranti 2025: భోగి మంటలతో ఆరంభమయ్యే సంక్రాంతి సందడి ఆద్యంతం ఆనందాన్నిస్తుంది. ఈ వేడుకలో భాగమే భోగిపళ్లు. ఇంతకీ భోగిపళ్లుగా ఏమేం పోస్తారు? ఎందుకవి?

Importance of Bhogi Pallu: దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఇల్లూ వాకిలీ ఊరూ వాడా కళకళలాడిపోతుంటాయ్. మూడురోజుల ముచ్చటైన పండుగలో మొదటిరోజు భోగి. ఈ రోజు భోగిమంటలు, బొమ్మలకొలువు, గొబ్బిళ్లు, భోగి పళ్లు ఇలా రోజంతా సందడే. ఈ రోజు రేగుపళ్లను భోగిపళ్లు అంటారు. వీటితో పాటూ కాయిన్స్, చెరుకు, బంతిపూల రెక్కలు, శనగలు..ఇలా వీటిని పిల్లలకు దిష్టితీసి తలపై పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో దిష్టితీసి బయటకు పడేస్తే..తోటి చిన్నారులంతా సరదాగా ఏరుకుంటారు. అందుకే భోగిపళ్లలో చాక్లెట్స్ కూడా మిక్స్ చేస్తారు.
Also Read: భోగి రోజు భగవంతుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు.. ఈ ప్రేమకథ చాలా ప్రత్యేకం!
శ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. దక్షిణానయం నుంచి ఉత్తరాయణం వైపు సూర్యుడు మళ్లే సమయంలో..సూర్యుడితో సమామంగా రేగుపల్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ రేగుపళ్లను భోగిపళ్లుగా పోస్తారు. మనదేశ వాతావరణానికి తగ్గట్టుగా ఏ ప్రదేశంలోనే అయినా రేగుచెట్టు పెరుగుతుంది.
శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు బదరికావనంలోనే తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారితలపై రేగుపళ్లు కురిపించారని పురాణకథనం. అలా నారాయణుడు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా పిల్లల్ని భావించి భోగిపళ్లు పోసే సంప్రదాయం ప్రారంభమైందంటారు.
Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు.
రేగు పళ్లను పిల్లల తల మీదపోయడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని.. తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందంటారు పండితులు.
రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో క్రిములు దరిచేరవు..చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
రేగుపళ్లు పోస్తే పిల్లలకు దిష్టి పోతుందంటారు నిజమేనా అంటే..నిజమే కొందరి నమ్మకం. ఏడాదికోసారి భోగిపళ్లు పోస్తే ఏడాది మొత్తం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం
భోగిమంటల దగ్గర చిన్నారులు ఎంత ఉత్సాహంగా ఉంటారో..భోగిపళ్లు పోసేటప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తారు. చిన్నారుల్ని చక్కగా అలంకరించి...తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు.
Also Read: భోగి మంట హోమంతో సమానం.. ట్రెండీగా కాదు ట్రెడిషనల్ గా వెలిగించండి!
రేగు పళ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది..దీంతో ఎముకలు బలంగా మారుతాయి. వీటిలో ఉండే పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందిస్తాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రేగుపళ్లు చాలా ఉపయోగపడాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పండు మంచిది..రక్తంలో చక్కెర నిల్వలు తగ్గించే గుణం దీనికుంటుంది. నిత్యం ఆహారంలో రేగుపండ్లు చేర్చుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. రక్తప్రసరణ , గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. వీటి పేస్ట్ ని చర్మంపై పూస్తే గాయాలు నయమవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రేగు పళ్లు తింటే ఉపశమనం లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

