Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Indias spending: దేశంలో ఎక్కువగా వినియోగవస్తువులపై ఎక్కువగా ఖర్చు పెట్టే రాష్ట్రాల జాబితాలో ఏపీ ముందు ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వారి కన్నా ఏపీ ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.
Southern states dominate Indias spending surge: గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో దక్షిణ భారతదేశం దేశంలోని మిగిలిన ప్రాంతాలను మించిపోయింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ఐదు దక్షిణాది రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రజల సగటు ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని అనుకోవచ్చు.
ఏపీ ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు !
కేరళలో గ్రామీణ కుటుంబాలు నెలకు రూ.6,611, పట్టణ కుటుంబాలు రూ.7,834 ఖర్చు చేస్తుండగా, జాతీయ సగటు రూ.4,122, రూ.6,996తో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,872, పట్టణ ప్రాంతాల్లో రూ.8,325తో తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉంది. తెలంగాణలో వరుసగా రూ.5,675, రూ.9,131 ఖర్చు పెడుతున్నారు. దక్షిణాదిలో అత్యధి వినియోగ ఖర్చు ఆంధ్రప్రదేశ్ నమోదు చేసింది. ఏపీల గ్రామీణ కుటుంబాలు రూ.6,107, పట్టణ కుటుంబాలు రూ.9,877 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,068, పట్టణ ప్రాంతాల్లో రూ.8,169తో కర్ణాటక మొదటి ఐదు స్థానాల్లో ఉంది. ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆహారం కోసం.. మెరుగైన జీవన ప్రాణాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.
గుజరాత్, మహారాష్ట్ర వంటి పారిశ్రామిక రాష్ట్రాల ఖర్చు జాతీయ సగటుకు అటూ ఇటూగా ఉంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఖర్చు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. గ్రామీణ, పట్టణ వ్యయంలో పశ్చిమ బెంగాల్ కూడా సగటు కంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యత్యాసాలను ఈ సర్వే గుర్తించింది. సిక్కింలో గ్రామీణ కుటుంబాలు రూ .9,377, పట్టణ కుటుంబాలు రూ .13,927 ఖర్చు చేస్తున్నాయి. చత్తీస్ గఢ్ లో అత్యల్పంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,739, పట్టణ ప్రాంతాల్లో రూ.4,927 ఖర్చు చేస్తున్నాయి. సిక్కిం అతి చిన్న ఈశాన్య రాష్ట్రం కాబట్టి పెద్ద రాష్ట్రాలతో పోల్చలేము కానీ అక్కడి ప్రజలు దేశంలో అందరి కన్నా ఎక్కువ ఖర్చుపెడుతున్నారు.
Also Read: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఖర్చుల మధ్య తేడా
గ్రామీణ-పట్టణ అసమానతలను కూడా ఈ సర్వే వెల్లడించింది. 104% గ్రామీణ-పట్టణ వ్యత్యాసంతో మేఘాలయ అగ్రస్థానంలో ఉండగా, జార్ఖండ్ 83%, చత్తీస్గఢ్ 80% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 28 రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ కేటగిరీల్లో 9 ఎంపీసీఈ స్థాయిలు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆగస్టు 2023 నుండి జూలై 2024 వరకు నిర్వహించిన గృహ వినియోగ వ్యయ సర్వే ఖర్చు ధోరణులు, పేదరికం, అసమానతలు వంటి వాటిని వెల్లడించింది.