AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న నరసరావుపేటకు వెళ్లనున్నారు. యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కోటప్పకొండను దర్శించుకుంటారు.

Chandrababu to start pension distribution in Narasaraopet | నరసరావుపేట: పింఛన్ల పంపిణీలో కూటమి సర్కార్ దూకూడు ప్రదర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చి అవ్వాతాతలు, మంచానికే పరిమితమైన వారికి ఇబ్బంది లేకుండా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు ఒకరోజు ముందే తరువాత నెల పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత కొన్ని నెలలుగా ఇదే కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు సైతం పింఛన్ పంపిణీలో పాల్గొంటున్నారు.
ఈ 31న నరసరావుపేటకు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి రానున్నారు. మంగళవారం ఉదయం 10.30కి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యల్లమందకు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం 11.20 గంటల నుంచి 11.40 వరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు (NTR Bharosa Pensions) గ్రామంలో అందజేస్తారు.
పింఛన్ లబ్దిదారులతో చంద్రబాబు మాటామంతీ
యల్లమంద గ్రామంలో కొందరు లబ్దిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛన్ అందిస్తారు. అనంతరం 11.45 గంటలకు స్థానికంగా ఉన్న కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన అనంతరం 12 గంటల నుంచి 12.45 వరకు పింఛనుదారులు, యల్లమంద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. తరువాత హెలిప్యాడ్ ప్రాంతంలో సీఎం భోజనం చేస్తారు. తరువాత 1.15 వరకు జిల్లా అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు 1.35 నుంచి 1.50 గంటల సమయంలో కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామి దర్శనం, పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమంద గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. దాదాపు 3 గంటలకు యల్లమందలో బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారని అధికారులు తెలిపారు.
వితంతు పింఛన్లు రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

