IPL 2021: ఎంత బాధేసిందో తెలుసా!! సన్‌రైజర్స్‌ను ఎంత ప్రేమించానో మీకెవ్వరికీ తెలియదన్న డేవిడ్ వార్నర్
సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో బాధేసిందని డేవిడ్ వార్నర్ అంటున్నాడు. ఆ జట్టును ఎంతో ప్రేమించానని తెలిపాడు. కారణాలేమీ లేకుండా తొలగించడమే బాధాకరమని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానులకు తనకెంతో మద్దతు ఇచ్చారని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంటున్నాడు. అభిమానులను అలరించేందుకే తాము క్రికెట్ ఆడతామని పేర్కొన్నాడు. కారణాలేమీ చెప్పకుండానే తనను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ, జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించిందని వెల్లడించాడు. ప్రపంచకప్ తర్వాత అతడు మాట్లాడాడు.
'కొన్నేళ్ల పాటు ప్రేమించిన జట్టు నుంచి అకారణంగా తప్పించారు. కనీసం మాటైనా చెప్పకుండా నిజంగా నా తప్పేమీ లేకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారు. అందుకే ఎంతో బాధేసింది' అని వార్నర్ అన్నాడు.
ఏదేమైనా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తనకేమీ ఫిర్యాదులు లేవని డేవిడ్ వార్నర్ తెలిపాడు. భారత్‌లోని అభిమానులు ఎప్పుడూ తనకు అండగా నిలిచారని పేర్కొన్నాడు. వారి కోసమే తాను క్రికెట్ ఆడుతున్నానని వెల్లడించాడు. వారిని అలరించేందుకే క్రికెట్ ఆడతామని పేర్కొన్నాడు. మరింత నైపుణ్యం పెంచుకొనేందుకే కష్టపడతామని తెలిపాడు.
జట్టు నుంచి తప్పించడంతో నిరాశపడ్డానని వార్నర్ అన్నాడు. బలంగా పునరాగమనం చేసేందుకు కష్టపడ్డానని వెల్లడించాడు. 'క్రీడలు ఎంతో గొప్పవి. నిజంగా కష్టపడితే, అంచనాలకు మించి శ్రమిస్తే కచ్చితంగా రెండో అవకాశం వస్తుంది. అందుకే రాణించేందుకు ఎంతైనా కష్టపడాలని నిర్ణయించుకున్నా. అది నాకు ఫలితాన్నిచ్చినందుకు సంతోషంగా ఉంది' అని వెల్లడించాడు.
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచేందుకు డేవిడ్ వార్నరే కీలకంగా నిలిచాడు. జట్టుకు అతడు మెరుగైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించాడు. మరోవైపు ఫించ్ ఔటవుతున్నా పరుగులు చేశాడు. కీలకమైన ఫైనల్, సెమీస్‌లో రెచ్చిపోయాడు. మొత్తంగా 10 సిక్సర్లు, 32 బౌండరీలు బాదేసి 289 పరుగులు చేశాడు. 89* అత్యధిక వ్యక్తిగత స్కోరు.
289 runs. 89* high score. 32 fours. 10 sixes
— ICC (@ICC) November 15, 2021
Congratulations on a fantastic tournament, David Warner 🏅#T20WorldCup pic.twitter.com/m5XfzCRAA6
Also Read: Candice Warner on Twitter: హేళన చేయకు బ్రో.. సన్‌రైజర్స్‌కు సరైన రిప్లై ఇచ్చిన వార్నర్ భార్య
Also Read: T20 World Cup Prize Money: విశ్వవిజేతకు వచ్చింది ఇదే.. టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతంటే?
Also Read: Sachin Debut Day: ఆటగాడిగా వచ్చి.. దేవుడిగా ఎదిగి.. సచిన్ ఎంట్రీకి 32 ఏళ్లు!