Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
విరాట్ కోహ్లీ రాగానే టీమ్‌ఇండియా మరింత బలోపేతం అవుతుందని కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు. అతడి పాత్రలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఇంకా ఏం చెప్పాడంటే?
మ్యాచ్ పరిస్థితులను బట్టి జట్టులో ఆటగాళ్ల పాత్రలు మారుతుంటాయని టీమ్‌ఇండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మాజీ సారథి విరాట్ కోహ్లీ పాత్రలో మార్పేమీ ఉండదని పేర్కొన్నాడు. అతడు తిరిగొచ్చాక జట్టు మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20కి ముందు కోచ్ ద్రవిడ్‌తో కలిసి అనేక విషయాలపై మాట్లాడాడు.
జట్టులో విరాట్ కోహ్లీ పాత్ర గురించి ప్రశ్నించగా.. 'ఇదెంతో సులువైన విషయం! ఇప్పటి వరకు పోషించిన పాత్రనే ఇకపైనా కోహ్లీ పోషిస్తాడు. అందులో మార్పేమీ ఉండదు. అయితే మ్యాచ్ పరిస్థితులను బట్టి కోహ్లీ సహా అందరు ఆటగాళ్ల పాత్రలు మారుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే!' అని రోహిత్ అన్నాడు.
'ఛేదన చేయడంతో పోలిస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆటగాళ్ల పాత్రలు మారుతుంటాయి. ఆటలో మార్పులను బట్టి ఆటగాళ్ల పాత్రలు మారుతుంటాయి. విరాట్ కోహ్లీ తిరిగొచ్చాక జట్టు మరింత బలోపేతం అవుతుందనడంతో సందేహం లేదు. అతడి అనుభవం అలాంటిది. అతడు అద్భుతమైన ఆటగాడు. జట్టును మరింత బలంగా మారుస్తాడు' అని హిట్‌మ్యాన్ బదులిచ్చాడు.
క్రికెటర్ల పనిభారం పర్యవేక్షణ అవసరమని రోహిత్ అన్నాడు. జట్టులో పూడ్చాల్సిన అంతరాలు ఇంకా ఉన్నాయని పేర్కొన్నాడు. 'ఆ అంతరాలను పూడ్చడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఇతర జట్ల టెంప్లేట్‌ను అనుసరిస్తామని నేను చెప్పను. మాకేది మంచిదో దాన్నే పాటిస్తాం. ఆటగాళ్లు సయ్యద్ ముస్తాక్ అలీ, ఫ్రాంచైజీ, జాతీయ జట్టులో వేర్వేరు పాత్రలు పోషిస్తారు. క్రికెటర్లకు వారి పాత్రల గురించి స్పష్టంగా చెప్పాలి' అని రోహిత్ అన్నాడు.
🗣️🗣️ "It's important to focus on everyone and not just on one individual."#TeamIndia T20I captain @ImRo45 on whether the focus would only be on certain players during the #INDvNZ series. pic.twitter.com/7YUFQz5TAu
— BCCI (@BCCI) November 16, 2021
Also Read: IND vs NZ: మరో చరిత్రకు నాంది! కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొదటి సిరీస్.. కివీస్‌తో నేడే ఢీ!
Also Read: IND vs NZ: టీమ్‌ఇండియాతో టీ20 సిరీసుకు కేన్ విలియమ్సన్ దూరం.. కెప్టెన్ ఎవరంటే!
Also Read: Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి