Seaplane Water Aerodromes: ఏపీలో పది ప్రాంతాల్లో సీప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Seaplane Water Aerodromes: ఆంధ్రప్రదేశ్‌లో పది 'సీ ప్లేన్' వాటర్ ఏరోడ్రోములు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి ప్రకటించారు.

Seaplane Water Aerodromes: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాన్ని సీ ప్లేన్ పర్యాటకంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కూడా చేయూత ఇస్తోంది. అందులో భాగంగానే పది ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 10 ప్రాంతాలను 'సీ ప్లేన్' వాటర్ ఏరోడ్రోములుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నట్టు కేంద్ర పౌరవిమానాయన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ రాజ్యసభలో ప్రకటించారు. టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు. అరకు, గండికోట, కాకినాడ, లంబసింగి, నరసాపురం, ప్రకాశం బ్యారేజ్, రుషికొండ, శ్రీశైం, తిరుపతిని కనెక్ట్ చేసేందుకు పది ఏరో డ్రోములుగా డెవలప్ చేయనున్నారు.
ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న రవాణా సౌకర్యాలకు ఇప్పుడు ఏర్పాటు చేయబోయే సీ ప్లేన్ వాటర్ ఏరో డ్రోమ్‌లు అదనపు ఆకర్షణగా మారనున్నాయి. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి శ్రీశైలం వరకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి సీ ప్లేన్‌లో పర్యటించారు. అప్పుడే రాష్ట్రంలో సీప్లేన్ ఏరో డ్రోమ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి సాగుతున్న చర్చలకు ఇప్పుడు కేంద్రమంత్రి నుంచి వచ్చిన ప్రకటనతో పర్యటరంగానికి ఊతమిచ్చినట్టు అవుతుంది.





















