News
News
వీడియోలు ఆటలు
X

Ricky Ponting Update: ఐపీఎల్‌ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్‌ ఆఫర్‌.. ఎందుకు తిరస్కరించాడంటే?

టీమ్‌ఇండియా కోచ్‌ పదవిని తనకు ఆఫర్‌ చేశారని రికీ పాంటింగ్‌ చెప్పాడు. తనను ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయని తెలిపాడు. కొన్ని కీలక కారణాల వల్ల ఆఫర్‌ తిరస్కరించానని అంటున్నాడు.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌ 2021 సమయంలో టీమ్‌ఇండియా హెచ్‌కోచ్‌ పదవిని తనకు ఆఫర్‌ చేశారని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. తనను ఒప్పించేందుకు విపరీతంగా ప్రయత్నించారని తెలిపాడు. పనిభారం దృష్ట్యా తాను అందుకు అంగీకరించలేదని వెల్లడించాడు. పిల్లలు చిన్నవాళ్లే అయినా ద్రవిడ్‌ ఆ పాత్రకు అంగీకరించడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు.

దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌, ఛానెల్‌ 7లో కామెంటేటర్‌ పదవులను వదిలేయడం తనకు ఇష్టం లేదని రికీ పాంటింగ్‌ అన్నాడు. 'టీమ్‌ఇండియా కోచ్‌ పదవి చేపడితే ఏడాదిలో 300 రోజులు భారత్‌లోనే ఉండాలి. ఐపీఎల్‌ సమయంలో దీని గురించి నేను కొందరితో మాట్లాడాను. ఆఫర్‌ గురించి మాట్లాడిన వ్యక్తి నన్ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ సమయం లేకపోవడంతో నేను వదిలేశాను. ఎందుకంటే ఐపీఎల్‌లో కోచ్‌, ఛానెల్‌ 7 పదవులను నేను వదిలేయాలి' అని పాంటింగ్‌ తెలిపాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పాంటింగ్‌కు మంచి పేరుంది. కోచ్‌గా దిల్లీ క్యాపిటల్స్‌ను చాలా మార్చాడు. 2019 నుంచి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్తున్నాడు. కుర్రాళ్లను తీర్చిదిద్దాడు. కాగా రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచింగ్‌ పదవిని చేపట్టడం ఆశ్చర్యం కలిగించిందని అతడు తెలిపాడు. 'ద్రవిడ్‌ కోచ్‌ పదవి చేపట్టడం ఆశ్చర్యమే. అండర్‌19 కోచ్‌గా ఉన్నప్పుడు కోచ్‌ పదవిని ఎంత ఆస్వాదించాడో చాలాసార్లు తెలిసింది. అతడి కుటుంబ పరిస్థితి నాకైతే తెలియదు. బహుశా కచ్చితంగా చిన్న పిల్లలు ఉండే ఉంటారు. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది' అని పాంటింగ్‌ అన్నాడు.

Also Read: Hardik Pandya Wrist Watch: చిక్కుల్లో హార్ధిక్ పాండ్యా.. కోట్ల విలువ చేసే వాచ్‌లు సీజ్..! స్పందించిన స్టార్ ఆల్ రౌండర్

Also Read: IPL 2021: ఎంత బాధేసిందో తెలుసా!! సన్‌రైజర్స్‌ను ఎంత ప్రేమించానో మీకెవ్వరికీ తెలియదన్న డేవిడ్‌ వార్నర్‌

Also Read: Rohit Sharma on Kohli: విరాట్‌ గురించి రోహిత్‌ బిగ్‌ స్టేట్‌మెంట్‌.. ఏం చెప్పాడో తెలుసా?

Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ

Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!

Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 05:06 PM (IST) Tags: Team India Rahul Dravid Head coach Ricky Ponting

సంబంధిత కథనాలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ -  ఎలా ఉందో చూశారా?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!

ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !