అతను పేపర్ కెప్టెన్ అంతే.. ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ షోకింగ్ కామెంట్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ని పేపర్ కెప్టెన్ అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. సీఎస్‌కే టీమ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నన్ని రోజులు రుతురాజ్ ఫుల్ టైం కెప్టెన్ అనిపించుకొలేడని, ప్రస్తుతం జట్టుకి కెప్టెన్‌గా లేకపోయినా జట్టుపై పూర్తి ఆధిపత్యం మాత్రం ధోనీ చేతిలోనే ఉంటుందన్నాడు. 'సీఎస్‌కే టీమ్‌లో ధోనీ రోల్ కచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువ. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడు. షాడో కెప్టెన్‌గా జట్టును నడిపిస్తాడు. ఆటగాళ్లకు గైడెన్స్ ఇస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ధోనీ సూచనలనే పాటిస్తాడు. పేపర్‌పై రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కావచ్చు. కానీ ధోనీ మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథిగా వ్యవహరిస్తాడు. ధోనీ ఏం చేయగలడనే విషయంపై ఎలాంటి సందేహం లేదు..' అంటూ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ కేవలం వికెట్ కీపర్‌గానే కంటిన్యూ అయ్యాడు. బ్యాటింగ్‌లో కూడా చివర్లో బరిలోకి దిగాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమైతే.. ధోనీనే జట్టును నడిపించాడు. కానీ సీఎస్‌కే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇలాంటి టైం లో అప్‌కమింగ్ 2026 సీజన్‌లోనూ 44 ఏళ్ల ధోనీ వికెట్ కీపర్ గా ఉండబోతున్న టైంలో కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్నాయి. మరి కైఫ్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఎంటి?





















