Shivanasamudra Elephant Rescue | ఏనుగును కాపాడే రెస్క్యూ ఆపరేషన్ చూశారా.? | ABP Desam
ఓ ఏనుగు పొరపాటున పెద్ద కాలువలో పడిపోయింది. దానికి అంత పెద్ద గట్టు ఎలా ఎక్కాలో తెలియలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో భయపడిపోతున్న ఆ ఏనుగును అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా రెస్క్యూ చేశారు. కర్ణాటకలోని శివనసముద్రలోని వాటర్ ఫాల్స్ దగ్గర జరిగింది ఈ ఘటన. శివనసముద్ర వాటర్ ఫాల్స్ దగ్గర కాలువలో పడిపోయి పైకి ఎక్కలేక ఇబ్బంది పడుతున్న ఏనుగను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంత బరువైన ప్రాణిని పైకి లాగాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న విషయం కాబట్టి ముందు దానికి అధికారులు మత్తు ఇంజక్షన్ షూట్ చేశారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత భారీ క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి పైకి తీసుకువచ్చారు. ఓ రోజంతా ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగింది. క్రేన్ సాయంతో పైకి తీసిన ఏనుగును దూరంగా తీసుకువెళ్లి సురక్షితమైన అభయారణ్యం లాంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.





















