Mukhi Cheetah Given birth Five Cubs | ఫలించిన ప్రాజెక్ట్ చీతా...కునో నేషనల్ పార్క్ లో సంబరాలు | ABP Desam
ప్రధాని నరేంద్ర మోదీ కల ఫలించింది. భారత్ లో 70ఏళ్ల క్రితం అంతరించిపోయిన చీతాలను మళ్లీ మన దేశంలో తిరిగేలా చేయాలని ఆయన సంకల్పంతో ప్రారంభమైన ఆపరేషన్ చీతా ప్రాజెక్ట్ ఓ కీలక విజయాన్ని ఈరోజు నమోదు చేసింది. నమీబియా దేశం నుంచి భారత్ కు తీసుకువచ్చిన చీతాల ద్వారా జన్మించిన ముఖి అనే పేరున్న ఆడ చీతా...ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మినిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో ఈ పిల్లలు జన్మించాయి. ఫలితంగా మన దేశంలో 70ఏళ్ల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో చీతాలు పుట్టడం ఇదే ప్రథమంగా రికార్డుల్లో నమోదైంది. భారత్ లో 1952లోనే చీతాలు అంతరించిపోయాగా... ఆపరేషన్ చీతా కోసం నరేంద్ర మోదీ 3500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. తొలిదశలో చీతాలను నమీబియా నుంచి భారత్ కు తెచ్చినప్పుడు ఆయనే స్వయంగా కునో నేషనల్ పార్క్ కి వాటిని అడవిలోకి విడుదల చేయటంతో పాటు కెమెరాతో ఫోటోలు కూడా తీశారు.





















