అన్వేషించండి

Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం

Andhra agricultural sector: వ్యవసాయరంగంలో పెను మార్పులపై చంద్రబాబు దృష్టి సారించారు. 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు.

Chandrababu Naidu focuses  major changes in agricultural sector:  వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేలమందితో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మీకోసం రైతన్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనుంది. ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....‘17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలిపారు. 

ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించాం. నీటి భద్రత,  డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టాం. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతో పాటు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలని ఆదేశించారు.  రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నాం. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలన్నారు. 

కడపలో ప్రకృతి సాగును కూడా పరిశీలించాను... ఆ సాగు రైతులు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ప్రైవేట్ ఎరువుల షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లోని ఎరువుల ధర తక్కువగా ఉంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రైతుల ఏ పంటలు సాగు చేశారు... వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి. సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను, సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించాలి. పూర్తి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా రిజర్వాయర్లను నింపగలిగాం. అలాగే సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Latest Dance Video: సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Embed widget