Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Gen Z protests: నేపాల్ లో మళ్లీ కొన్నిప్రాంతాల్లో జెన్ Z నిరసనలు ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Fresh Gen Z protests erupt in Nepal: నేపాల్‌లోని బారా జిల్లాలో జనరేషన్-జె యువత మరోసారి రోడ్డెక్కింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యునిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్ కార్యకర్తలు జెన్ Z యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సిమారా ప్రాంతంలో కొత్తగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్‌లు వాడినా ప్రయోజనం లేకపోవడంతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 8 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
బారా జిల్లాలో గురువారం ఉదయం నుంచే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సిమారా చౌక్ వద్ద ఎయిర్‌పోర్ట్ సమీపంలో జెన్-z నాయకుడు సమ్రాట్ ఉపాధ్యాయ్ సహా ఏడుగురు యువకులు గాయపడ్డారు. 10-12 మంది సిపిఎన్-యుఎమ్ఎల్ కార్యకర్తలు శాంతియుతంగా సమావేశమైన యువకులపై దాడి చేశారని వారు ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు టియర్ గ్యాస్‌లు ప్రయోగించారు. సిమారా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపేశారు.
New Gen-Z protests erupt up in Nepal, curfew enforced in Bara district.#Nepal #Protest #GenZ pic.twitter.com/zIBlRddeHt
— The Tatva (@thetatvaindia) November 20, 2025
జెన్ జెడ్ నిరసనలు మొదట్లో ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధం కారణంగా ప్రారంభమయ్యాయి. ఈ తిరుగుబాటు 76 మంది మరణాలకు, మాజీ ప్రధాని కేపీ ఒలి రాజీనామా ఇవ్వడానికి దారితీసింది. ప్రస్తుతం జెన్-జె యువత మాహేష్ బాస్నెట్ , దాడికి పాల్పడిన యుఎమ్ఎల్ కార్యకర్తల అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలపై మధ్యంతర ప్రధాని సుశీలా కార్కి స్పందించారు. దేశంలో అనవసర వివాదాలు సృష్టించకుండా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. శాంతి , క్రమశిక్షణను కాపాడటానికి అత్యంత జాగ్రత్తలతో పనిచేయాలని భద్రతా దళాలను ఆదేశించినట్లుగా ప్రకటించారు.
#Nepal | Curfew re-imposed in Bara of Nepal as the tension continues to flare between the Gen-Z and the UML cadres. The curfew will be in place till 8 PM (Local Time), as per the order from the District Administration Office, Bara. pic.twitter.com/pSG4RnpM0c
— Arpana Baishya (@ArpanaSpeaks) November 20, 2025
సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత జైలు నుంచి వేలాదిమంది ఖైదీలు పారిపోయారు. ఆయుధాలు తగ్గిపోయాయి. ఇది భద్రతా పరిస్థితిని మరింత బలహీనం చేసింది. అందుకే ప్రభుత్వం ఎలాంటి నిరసనలు జరిగినా కంగారు పడుతోంది.
🚨 BREAKING | Gatherings Banned In Nepal As Fresh Gen Z Protests Erupt #Nepal #GenZ https://t.co/LxJ6mFrppp pic.twitter.com/J6RjHCv4DF
— Arpana Baishya (@ArpanaSpeaks) November 20, 2025




















