International Mens Day 2025 : అంతర్జాతీయ పురుషులు దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే.. సోషల్ మీడియాలో ఇలా విష్ చేసేయండి
Mens Day Wishes : ప్రతి ఏడాది నవంబర్ 19వ తేదీన మగవారికోసం ప్రత్యేకంగా ఓ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మరి దీని ప్రాముఖ్యత ఏంటో.. వారికి ఎలా విషెష్ చెప్పాలో చూసేద్దాం.

Mens Day 2025 Significance and History : ఆడవారికే కాదు.. మగవారికి కూడా ఓ స్పెషల్ డే ఉంది. కానీ చాలామంది మగవారికి ఈ విషయం కూడా తెలియదు. వారిలో మీరు కూడా ఒకరా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మగవారికి కూడా ఓ ప్రత్యేకమైన డే ఉంది. అదే అంతర్జాతీయమ పురుషుల దినోత్సవం(International Men’s Day). దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీన జరుపుకుంటారు. ఈ ఏడాది(2025లో) ఈ స్పెషల్ డే బుధవారం రోజు వచ్చింది. మరి ఈ మెన్స్ డే ఎందుకు చేస్తారు? ప్రాముఖ్యతలు ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.
పురుషుల దినోత్సవం చరిత్ర
ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటారు. దీనిని 1999లో ట్రినిడాడ్ & టొబాగో దేశంలో మొదటిసారిగా నిర్వహించారు. పురుషులు సమాజానికి చేస్తున్న కృషి, బాధ్యతలు, కుటుంబం కోసం చేసే త్యాగాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేకమైన తేదీని జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు 90వరకు పైగా దేశాలు ఇంటర్నేషనల్ మెన్స్ డేని నిర్వహిస్తున్నాయి.
మెన్స్ డే ప్రాముఖ్యత
పురుషులు సమాజానికి చేస్తున్న కృషిని గుర్తించి.. వారికి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పడమే దీని ఉద్దేశం. ఎందుకంటే కుటుంబం, ఉద్యోగం, సమాజం పురుషులు చేసే కష్టాన్ని ఎక్కువమంది గుర్తించరు. కానీ వారి కష్టాన్ని గుర్తించి.. సెలబ్రేట్ చేయడమే మెన్స్ డే ప్రధాన ఉద్దేశంగా చెప్తారు. అలాగే పురుషుల్లోని మానసిక ఆరోగ్యంపై కూడా ఫోకస్ చేసి హైలెట్ చేస్తుంది.
ఈ మధ్యకాలంలో పురుషుల్లో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. దానిని తగ్గించి నిర్మూలించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. పురుషులకు గౌరవం ఇవ్వడమే కాకుండా.. వారు ఎదుర్కొనే సైలెంట్ స్ట్రగుల్స్‌కు ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇవ్వాలి. సామాజిక ఒత్తిళ్లు, ఆర్థిక భారం, భావోద్వేగాలను వ్యక్తం చేయలేని సమయాల్లో వారికి తోడుగా ఉండాలి.
ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు 2025..
అంతర్జాతీయ పురుషులు దినోత్సవం సందర్భంగా మీరు మీ లైఫ్‌లోని స్పెషల్ పర్సన్‌కి విషెష్ చెప్పాలనుకుంటే.. మీరు వారి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా విషెష్ చెప్పేయండి.
- తమ కుటుంబాలకోసం అహర్నిషలు కష్టపడుతూ.. ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న పురుషులందరికీ హ్యాపీ మెన్‌స్ డే!
- మీరే మా జీవితాల్లో నిజమైన హీరోలు. మీరు లేకుంటే మేము ఇంత హ్యాపీగా ఉండేవాళ్లం కాదు. హ్యాపీ మెన్‌స్ డే!
- కుటుంబానికి అండగా నిలిచే ప్రతి పురుషుడికి హృదయపూర్వక ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు!
- మీ కృషి, మీ ప్రేమ, మీ త్యాగం – ఇవన్నీ అమూల్యం. హ్యాపీ మెన్‌స్ డే!
- బయట ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా… లోపల ఎన్నో భావోద్వేగాలు దాచుకునే ప్రతి పురుషుడికి హ్యాపీ మెన్‌స్ డే!
- నా లైఫ్‌లో బిగ్ సపోర్ట్‌గా ఉన్న అన్న, నాన్న.. మీ ఇద్దరూ నాకు మెయిన్ పిల్లర్స్. హ్యాపీ మెన్‌స్ డే బోత్ ఆఫ్ యూ.
ఇలా మీకు నచ్చినవారికి, మీకు సపోర్ట్ చేసిన.. చేస్తోన్న మగవారికి సోషల్ మీడియాలో చక్కగా మెన్స్ డే విషెష్ చెప్పేయండి. వీలుంటే కుదిరితే వారికి అవసరమైన, వారు ఉపయోగించగలిగే గిఫ్ట్స్ కూడా ఇవ్వండి.






















