అన్వేషించండి

Mens Mental Health Awareness Month : మగవారి మానసిక ఆరోగ్యానికై జూన్​ నెల.. ఎక్కువమంది ఇబ్బంది పడుతోంది వీటివల్లే అట

Men Mental Health : మగవారు మానసికంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించి.. ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రతి ఏడాది జూన్​ నెలను Men's Mental Health Awareness Monthగా నిర్వహిస్తున్నారు. 

Male Mental Wellness : మానసిక ఆరోగ్యం అనేది ఎవరికైనా ముఖ్యమే. అది ఆడవారికైనా.. మగవారికైనా. కానీ సమాజం మగవారి విషయంలో కాస్త కఠినంగానే ప్రవర్తిస్తుందనే చెప్పుకోవాలి. చట్టాలు, సమాజం, కుటుంబం ఇలా అందరిలోనూ మగవారి ఎమోషన్స్​కి పెద్దగా వాల్యూ దొరకట్లేదు. ఈ ధోరణి వల్ల చాలామంది పురుషులు ఇబ్బంది పడుతున్నారని.. మానసికంగా కృంగిపోతూ సూసైడ్స్​ వరకు వెళ్తున్నారని పలు అధ్యయనాలు గుర్తించాయి. దీనిలో భాగంగానే జూన్​ నెలను మెన్స్ మెంటల్ హెల్త్​ అవరెనెస్ మంథ్​గా నిర్వహిస్తున్నారు. 

మగవారి సమస్యలను గుర్తిస్తూ.. మానసికంగా వారు పడుతోన్న వేధనను సమాజానికి చెప్పేందుకు వీలుగా Men's Mental Health Awareness Monthను చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్తూ.. వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. సమాజంలో మగవారు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సహాయం అడగలేక.. 

వివిధ అధ్యయనాలు ప్రకారం చాలామంది పురుషులు తమ మానసిక ఆరోగ్యంపై బయటకి మాట్లాడలేకపోతున్నారట. వృత్తిపరమైన సహాయం తీసుకోవడంలో కూడా వెనకడుగు వేస్తున్నారట. స్ట్రాంగ్, టఫ్ అనే ట్యాగ్స్ సమాజం ఇవ్వడం వల్ల వారు సాయం అడిగేందుకు కూడా వెనకాడుతున్నారట. 

ఆత్మహత్యలు..

ఇలా అన్ని తమలోనే దాచుకుని.. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల్లోనే ఆత్మహత్య రేట్లు గణనీయంగా పెరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మగవారు సూసైడ్ చేసుకునే అవకాశం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందట. 

కుటుంబ బాధ్యతలు.. 

పెళ్లికి ముందు, తర్వాత పేరెంట్స్ బాధ్యత, అలాగే మ్యారేజ్ తర్వాత భార్య, పిల్లల బాధ్యత తీసుకుంటూ.. వారి అంచనాల రీచ్ అయ్యేందుకు తెగ కష్టపడుతున్నారట. తల్లిదండ్రులు, భార్య, పిల్లల ఇష్టాలు తీర్చడం కోసం.. వారికి కనీసం వసతులు అందించడం కోసం చాలామంది తమ పర్సనల్ లైఫ్​ని వదిలేసుకుంటున్నారట. 

శారీరక ఆరోగ్యం.. 

మానసిక కుంగిపోవడం వల్ల చాలామంది శారీరకంగా కూడా ప్రభావితమవుతున్నారట. అందుకే వారిలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిద్ర సమస్యలు ఎక్కువ అవుతున్నాయట. అందుకే మగవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మాదకద్రవ్యాలు కూడా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. 

వర్క్ ప్లేస్​లో 

వర్క్​ ప్లేస్​లో పనితీరు, ఆర్థిక బాధ్యతలు, సామాజిక అంచనాలపై మగవారు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారట. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతింటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. 

ఈ అంశాలను బహిరంగంగా చర్చించేందుకే ఈ జూన్​ నెలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. #MensHealthMonth, #MentalHealthMatters, #ManUpToTalk వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో అవగాహన పెంచుతున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget