అన్వేషించండి

Expensive Coffee : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఒక కప్పు 80 వేలు మాత్రమే, ఫుల్ డిటైల్స్ ఇవే

World’s Costliest Coffee : దుబాయ్ కేఫ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని అందిస్తోంది. ఒక్క కప్పు కాఫీ $1,000. మరి దీనిని ధర ఎందుకు అంత ఎక్కువ ఉందో చూసేద్దాం.

Worlds Most Expensive Coffee : దుబాయ్‌లోని ఒక కేఫ్ ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని అందిస్తోంది. ఒక కప్పు ధర 3,600 దిర్హమ్స్ (సుమారు $980). మరి దీని ధర ఎందుకు అంత ఎక్కువగా ఉందో? కాఫీ లవర్స్​కి వీరు అందించే ప్రత్యేక రుచి ఏంటో వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం. 

అరుదైన కాఫీ

ఈ విలాసవంతమైన కాఫీ బీన్స్​ని పశ్చిమ పనామాలోని మౌంట్ బారు అగ్నిపర్వత వాలులలో పండించే అరుదైన, ఎలైట్ జాతిగా చెప్తారు. ఇది నీడో 7 రకమైన గీషా బీన్స్ నుంచి వస్తుందట. ఈ బీన్స్ చిన్న మైక్రో-లాట్‌లలో పెరుగుతాయి. ప్రతి పంట కేవలం కొన్ని కిలోలు మాత్రమే ఇస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన కాఫీ బీన్స్‌లో ఒకటిగా నిలిచింది. అందుకే దీనిని దుబాయ్‌లోని జూలిత్ కెఫే ప్రీమియంగా సుమారు 400 కప్పులను మాత్రమే అందించాలని యోచిస్తోంది. కాఫీ ప్రియులలో కొందరు మాత్రమే దీనిని రుచి చూడగలుగుతారు.

రికార్డు సృష్టించిన వేలం

ఈ సంవత్సరం ప్రారంభంలో నీడో 7 గీషా బీన్స్ పనామాలో జరిగిన వేలంలో రికార్డు ధరను సాధించింది. ఇక్కడ 20 కిలోల గీషా బీన్స్​ సుమారు 2.2 మిలియన్ దిర్హమ్స్ ($600,000)లకు అమ్ముడయ్యాయి. అంతర్జాతీయ కొనుగోలుదారులలో చాలా బిడ్డింగ్ జరిగి ప్రపంచ రికార్డును సృష్టించింది.

రిజర్వ్ చేసి మరి ఇస్తారట

జూలిత్‌లో హెడ్ కాఫీ రోస్టర్ సెర్కాన్ సాగ్సోజ్ ది నేషనల్‌తో మాట్లాడుతూ.. దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కోసం ఒక కప్పు రిజర్వ్ చేశామని వెల్లడించారు. కొద్దిమంది మాత్రమే దీనిని తాగగలరని తెలిపాడు. ఇది ఒక గిమ్మిక్ లేదా మార్కెటింగ్ స్టంట్ కాదని తెలిపాడు. "నీడో 7 గీషా అనేది అసాధారణమైన కాఫీ. దీనిని భూమిపై కొద్దిమంది మాత్రమే రుచి చూస్తారు. ఇప్పుడు.. ఇది.. దుబాయ్‌లో అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ కావడంతో ప్రతి కప్పు చరిత్రలో ఒక భాగంగా అనిపిస్తుందని తెలిపారు.

కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందంటే..

కాఫీ ప్రొఫైల్‌ చాలా మైల్డ్, లేయర్స్​గా వర్ణించారు సాగ్సోజ్. జాస్మిన్ వంటి తెలుపు ఫ్లవర్ నోట్స్, నారింజ, బెర్గామోట్ వంటి సిట్రస్ ఫ్లేవర్.. నేరేడు, పీచ్ వంటి మైనర్ అండర్‌టోన్‌లు ఉంటాయి. "ఇది తేనెలా ఉంటుంది. మృదువైనది, సువాసనగలది, తీపిగా ఉంటుంది" అని చెప్పారు.

క్రౌన్ జ్యువెల్!?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు నీడో 7 గీషాను గీషా కుటుంబానికి చెందిన "క్రౌన్ జ్యువెల్"గా భావిస్తారు. ఈ రకం బెస్ట్ ఆఫ్ పనామా పోటీలో 98 స్కోరును సాధించింది. ఇది కాఫీ ప్రపంచంలో అత్యధికంగా నమోదు చేసిన వాటిలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి.. ఆరుగురు అంతర్జాతీయ న్యాయమూర్తులు కూడా దీనికి 100 మార్కులు ఇచ్చారు.

గ్లోబల్ బెంచ్‌మార్క్ 

దుబాయ్ ఇప్పటికే అత్యంత ఖరీదైన కాఫీకి గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉంది. గతంలో ఒక కప్పు కాఫీ 2,500 దిర్హమ్స్ ($680)లకు అమ్ముడైంది. కానీ జూలిత్ కాఫీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇది లగ్జరీ బ్రూస్‌కు కొత్త గ్లోబల్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
Floor Cleaning Tips: ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
ఫ్లోర్‌ తుడుస్తున్నప్పుడు నీటిలో ఇవి కలిపితే ఇల్లంతా ధగధగ మెరుస్తుంది!
Chicken Pulao Recipe: చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!
చికెన్ పులావ్ సీక్రెట్ రెసిపీ తెలుసుకుంటే చికెన్ బిర్యానీని మర్చిపోతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget