మేక పాలు తాగితే ఏమవుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారతదేశంలో పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ పాలు తాగుతారు.

Image Source: pexels

పాలు శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Image Source: pexels

సాధారణంగా మనం ఆవు లేదా గేదె పాలు తాగుతాము. కానీ మేక పాలు కూడా అంతే పోషకమైనవి.

Image Source: pexels

అలాంటప్పుడు మేక పాలు తాగడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం.

Image Source: pexels

మేక పాలలో కొవ్వు రేణువులు చిన్నవిగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి.

Image Source: pexels

అలాగే ఇందులో ఆవు పాలతో పోలిస్తే తక్కువ లాక్టోస్ ఉంటుంది.

Image Source: pexels

ఇందులో ఉండే సెలీనియం, జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image Source: pexels

అంతేకాకుండా మేక పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels

అలాగే అధిక మొత్తంలో ఐరన్, విటమిన్ A ని ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels