Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Temple flames : భక్తితో గుడికెళ్తాం. దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలుగివ్వాలి కానీ ఆ ఆలయాన్ని తగులబెట్టకూడదు. కానీ అదే జరిగింది.

Temple in flames due to tourist improper use of candles: చైనాలోని జియాంగ్సు ప్రాంతంలోని ఫెంఘువాంగ్ పర్వతం మీద ఉన్న ప్రసిద్ధ వెంచాంగ్ పవిలియన్ ఆలయం భారీ అగ్నిప్రలయానికి గురైంది. దీనికి కారణం ఓ భక్తుడు. ఆ ఆలయానికి వచ్చిన భక్తుడు క్యాండిల్స్, అగర్ బత్తీలు సరైన చోట పెట్టకపోవడ ంవల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్దారించారు. నవంబర్ 12న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్నిప్రలయంలో ఆలయం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, ప్రాణనష్టం జరగలేదు. చుట్టుపక్కల అడవులకు వ్యాప్తి చెందలేదు.
Fire Destroys Historic Pavilion at Yongqing Temple, Zhangjiagang, Jiangsu, China today.
— Weather Monitor (@WeatherMonitors) November 12, 2025
A fire at Yongqing Temple on November 12 destroyed the historic Wenchang Pavilion. Other parts of the ancient temple, founded in 536 AD, were unharmed. pic.twitter.com/G0ELU8s4le
చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ ప్రకారం, ఈ ఆలయం యాంగ్క్వింగ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో భాగం. 536 ఏడీలో లయింగ్ డైనస్టీలో స్థాపించి ఈ ఆలయం, 1958లో కూల్చివేసి 1990లలో మళ్లీ నిర్మించారు. ఇది మూడు అంతస్తుల కలిగిన చారిత్రక శైలి ఆకృతి. ఫెంఘువాంగ్ పర్వతం పైభాగంలో ఉండటం వల్ల ఇది పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అగ్నిప్రమాదం కారణంగా మొత్తం ఆలయం కాలిపోయి కూలిపోయింది.
A fire broke out yesterday at Yongqing Temple in Zhangjiagang, Jiangsu, China, destroying the Wenchang Pavilion.
— Volcaholic 🌋 (@volcaholic1) November 13, 2025
The pavilion that burned was a modern reconstruction, not the original ancient structure, but it was still a striking part of the temple complex.
Other parts of the… pic.twitter.com/6wUjul7cL0
పర్యాటకుడు ఆలయంలో పూజా కార్యక్రమాల సమయంలో కొవ్వోత్తులు, అగర్ బత్తీలు సరైన మార్గదర్శకాలు పాటించకుండా వాడటం వల్ల మంటలు రగిలాయి. "పర్యాటకుల అబాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని జియాంగ్జియాంగ్ సిటీ అధికారులు ప్రకటించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఫలితాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
మూడేళ్ల కిందట గాన్సు ప్రాంతంలోని శాండాన్ గ్రేట్ బుద్ధ టెంపుల్‌లోనూ ఇలాగే జరిగింది. అక్కడ కూడా ప్రధాన ఆలయం దెబ్బతిన్నది. చైనాలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న మధ్య, ఇలాంటి ప్రమాదాలు హెరిటేజ్ సైట్లలో ఎక్కువ అవుతున్నాయి.




















