Chiranjeevi Venkatesh Song: చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
MSG Movie Songs: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'లో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. వాళ్ళిద్దరిపై ఓ సాంగ్ తీశారు. దాని రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు... వాళ్ళిద్దరిపై ఓ సాంగ్ తీశారు. ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 30న ఫుల్ సాంగ్ రిలీజ్...
'మెగా విక్టరీ' సాంగ్ ప్రోమో ఎప్పుడంటే?
చిరంజీవి, వెంకటేష్ మీద మెగా విక్టరీ మాస్ సాంగ్ ఒకటి తెరకెక్కించారు. ఆ పాట ప్రోమోను డిసెంబర్ 27వ తేదీన... అంటే రేపు విడుదల చేయనున్నారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది.
'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి ఇప్పటికే 'మీసాల పిల్ల', 'శశిరేఖ' విడుదల అయ్యాయి. ఆ రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు చిరు - వెంకీ పాటకు భీమ్స్ ఎటువంటి బాణీ ఇచ్చారో చూడాలి.
Also Read: శివాజీ తప్పేముంది? యంగ్ హీరో రక్షిత్ అట్లూరి సపోర్ట్
View this post on Instagram
'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థల మీద సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వీటీవీ గణేష్, కేథరిన్ త్రేసా, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, రచయితలు: ఎస్ కృష్ణ - జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, ఎడిషనల్ డైలాగ్స్: అజ్జు మహంకాళి - తిరుమల నాగ్.





















