అన్వేషించండి

Patang Movie Review - 'పతంగ్' రివ్యూ: ఒకేసారి ఇద్దరు అబ్బాయిలను ప్రేమిస్తే? Rom Com ఎలా ఉందంటే?

Patang Review In Telugu: ప్రీతి పగడాల కథానాయికగా పరిచయమైన సినిమా 'పతంగ్'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రత్యేక పాత్ర చేశారు. 'జీ సరిగమప' రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ హీరోలు. ఈ సినిమా ఎలా ఉందంటే?

Preeti Pagadala's Patang Movie Review In Telugu: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు చాలా మందికి ప్రీతి పగడాల తెలుసు. ఆమె పాపులర్. ప్రీతి కథానాయికగా పరిచయమైన సినిమా 'పతంగ్'. 'జీ సరిగమప' రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ హీరోలు. ఈ నెల 25న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. క్రిస్మస్ బరిలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ (Patang Movie Story): ఐశ్వర్య (ప్రీతి పగడాల)ది కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్. ఏ అంశం అయినా సరే... రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి ఒక్కటి సెలెక్ట్ చేసుకోమని చెబితే చేసుకోలేదు. అటువంటి అమ్మాయి బస్తీ కుర్రాడు విస్కీ అలియాస్ వంశీ కృష్ణ (వంశీ పూజిత్)తో ప్రేమలో పడుతుంది.

విస్కీది బస్తీ అయినప్పటికీ... అతనితో సంపన్న కుటుంబానికి చెందిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్) స్నేహం చేస్తాడు. వాళ్ళిద్దరికీ పన్నెండేళ్ల స్నేహం. విస్కీ ద్వారా ఐశ్వర్య, వంశీ కృష్ణ ఒకరికొకరు పరిచయం అవుతారు. తర్వాత ప్రేమలో పడతారు. 

ఐశ్వర్య, అరుణ్ ప్రేమలో పడ్డారని విస్కీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక అతను ఏం చేశాడు? అరుణ్, విస్కీ... ఇద్దరిలో చివరికి ఐశ్యర్య ఎవరిని సెలెక్ట్ చేసుకుంది? ఈ ముక్కోణపు ప్రేమ కథకు ఎటువంటి ముగింపు దక్కింది? అనేది సినిమా.

విశ్లేషణ (Patang Review Telugu): ముక్కోణపు ప్రేమ కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు... ప్రేమలో ఓ అబ్బాయి మోసపోవడం లేదా త్యాగం చేయడం వంటివి సహజం. వెండితెరపై సూపర్ హిట్టైన ఫార్ములాతో కొత్త ముగింపు ఇస్తూ, ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తూ తీసిన సినిమా 'పతంగ్'. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమించడం కాదు... ఇద్దర్నీ ఓ అమ్మాయి, అదీ ఒకేసారి ప్రేమించడం ఇక్కడ పాయింట్. మోసం చేయాలని కాదు... కన్‌ఫ్యూజ్డ్‌ లేదా డెసిషన్ తీసుకోలేని స్టేట్ అన్నమాట. అది రివీల్ అయినప్పుడు 'వావ్' ఫ్యాక్టర్ ఉండదు. కానీ కామెడీ మాత్రం ఫుల్లుగా ఉంది.

తమది న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఫిలిమ్ అని దర్శక నిర్మాతలు చాలా మంది చెబుతుంటారు. అయితే సినిమాలో అటువంటి విషయం ఉండదు. కానీ, 'పతంగ్' పక్కా New Age Rom Com. పానీ పూరి బండి కుర్రాడితో అమ్మాయి ప్రేమలో పడిందని మీమ్స్ లేదా వార్తల్లో చూసి ఉంటారు. ఆ సీన్ చూపించిన సినిమా 'పతంగ్'. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే... ఇదొక సింపుల్ కథ. డైలీ లైఫ్‌లో మనకు ఎదురయ్యే సందర్భాలు లేదా మనుషులు తెరపై కనిపిస్తారు. అటువంటి సందర్భాల్లో దర్శకుడు ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి చక్కటి వినోదం పండించారు.

'పతంగ్'లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు భలే కుదిరిరాయి. కాంప్లికేషన్స్‌ ఏమీ లేకుండా సింపుల్‌గా ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు దర్శకుడు ప్రణీత్. అయితే ఎమోషనల్ సీన్స్‌కు సైతం సింపుల్ ఎండింగ్ ఇవ్వడం వల్ల ఓ ఫీల్ మిస్ అయ్యింది. అలాగే, నిడివి కూడా కొంచెం ఎక్కువైంది. ఈజీగా 15 నిమిషాలు కట్ చేసి క్రిస్పీగా కథను చెప్పడం వల్ల కామెడీని ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసే పాజిబిలిటీ ఉంటుంది. జెన్ జి (ఈతరం) యువతీ యువకుల్లో ప్రేమ, ఆకర్షణ పట్ల భావాలను వినోదాత్మకంగా చూపించారు.

సినిమా మొదలైన కాసేపటికి ఆ క్యారెక్టర్లతో ట్రావెల్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలుసు కాబట్టి సన్నివేశాలను ఎంజాయ్ చేస్తాం. డైలాగుల్లో చిన్న పంచ్ ఇవ్వడం, సిట్యువేషనల్ ఫన్ వంటివి వర్కవుట్ అయ్యాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon)తో 'దర్శకులు బాగా సంపాదిస్తారట కదా' అని అడిగితే... 'అవును. అందుకే కొన్నిసార్లు నటించాల్సి వస్తుంది' అని ఆన్సర్ ఇస్తారు. ఇంకోసారి ఆయనతో హీరో వంశీ పూజిత్ 'సార్, మీ తూటా (ధనుష్ ఫ్లాప్ సినిమా) మూడుసార్లు చూశా' అంటారు. ఈ తరహాలో సింపుల్ పంచ్ డైలాగ్స్ భలే పేలాయి.

Also ReadVrusshabha Movie Review - 'వృషభ' రివ్యూ: 'మగధీర' లాంటి కథతో మోహన్ లాల్ సినిమా... పునర్జన్మల కాన్సెప్ట్‌తో హిట్ వచ్చేనా?

Patang Telugu Review Rating: 'పతంగ్'లో సింపుల్ రైటింగ్‌కు స్ట్రాంగ్ సపోర్ట్ జోస్ జిమ్మీ మ్యూజిక్ నుంచి లభించింది. పాటల్లో (ట్యూన్స్)లో వేరియేషన్ చూపించారు. మ్యూజిక్ రీఫ్రెషింగ్‌గా ఉంది. ఆర్ఆర్ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు ఓ ప్లజెంట్ ఫీల్ యాడ్ చేసింది. ఖైరతాబాద్ గణేశుడి నుంచి హైదరాబాద్ సిటీలో చాలా వరకు రియలిస్ట్ లొకేషన్లలో సినిమాను షూట్ చేశారు. ఫ్రేమింగ్ బావుంది. నిర్మాతలు కథకు అవసరమైన రీతిలో ఖర్చు చేశారు. చిన్న సినిమా అనిపిస్తుంది కానీ 'పతంగ్' పోటీల వీఎఫ్ఎక్స్ కోసం కనిపించని ఖర్చు అవుతుంది.

'పతంగ్'లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసిన ఫేస్ గౌతమ్ మీనన్‌ది. ఆయన ఎంట్రీ, ఆయనపై వేసిన పంచ్ డైలాగ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాకు మెయిన్ పిల్లర్ ప్రీతి పగడాల. కన్‌ఫ్యూజ్ అయ్యే సిట్యువేషన్లలో ఆమె ఫేస్ భలే క్యూట్‌గా ఉంది. నటిగానూ కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. వంశీ పూజిత్‌తో మాంచి మాస్ రోల్స్ చేసే యాక్టింగ్ కేపబిలిటీ ఉంది. బస్తీ కుర్రాడిగా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. ప్రణవ్ కౌశిక్ క్లాసీగా నటించారు. అతని తల్లిదండ్రులుగా ఎస్పీ చరణ్, అను హాసన్ కనిపించారు. మిగతా పాత్రలకూ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ సెట్ అయ్యింది.

రెండున్నర గంటలు ప్రేక్షకులను హాయిగా నవ్వించే సినిమా 'పతంగ్'. సింపుల్ కథతో సినిమా తీసినా మంచి మ్యూజిక్, క్యాస్టింగ్ కుదిరాయి. అన్నిటికీ మించి సున్నితమైన హాస్యం ఉంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.

Also ReadDhandoraa Movie Review - 'దండోరా' రివ్యూ: ప్రేమ, చావు మధ్యలో కుల వివక్ష కుంపటి... శివాజీ కొత్త సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President:  బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President:  బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల  వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report  :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget