Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్‌పై దాడి | ABP Desam
కారుకు సైడ్ ఇవ్వలేదని వృద్ధుడైన ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్ బాలరాజు ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల రోడ్డుపై బస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో వెనుక నుంచి ఓ కారు డ్రైవర్ సైడ్ ఇవ్వాలని హార్న్ కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి బాలరాజు సైడ్ ఇవ్వగా.. కార్ డ్రైవర్ బస్సును ఓవర్ టేక్ ముందుకొచ్చి కార్ అడ్డంగా ఆపి బాలరాజును బూతులు తిడుతూ బస్సులోకి ఎక్కడమే కాకుండా.. కాలితో తంతూ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడ ఓ మహిళ వీడియో తీయడమే కాకుండా.. దాడి చేసిన వ్యక్తిని ‘ఎందుకు కొడుతున్నావ్?’ అంటూ నిలదీసింది. ‘సైడ్ ఇవ్వకపోతే కొడతావా? పద పోలీస్ స్టేషన్‌కి’ అంటూ బెదిరించింది. ఇక ఆమె శివంగిలా బెదిరిస్తుంటే అక్కడున్న మగమహారాజులంతా నిలబడి చూస్తుండటం విచిత్రం. ఇక ఆమె బెదిరింపులతో సదరు కార్ డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోగా.. కారు దిగి వచ్చిన కొంతమంది మహిళలు ఆమెతో పోట్లాటకి దిగారు. అయితే వాళ్లకి కూడా ఆమె దీటుగా సమాధానం చెప్పింది. ఈ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక దాడి చేసిన వ్యక్తి పేరు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా సమాచారం.





















