Rachin Ravindra: రాహుల్‌ ద్రవిడ్‌లో 'ర'.. సచిన్‌లో 'చిన్‌' కలిస్తే 'రచిన్‌ రవీంద్ర'.. కివీస్‌లో భారత క్రికెటర్‌

న్యూజిలాండ్‌లో భారత సంతతి రెండో క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర. తొలి టీ20లో అందరి దృష్టిని ఆకర్షించాడు. సచిన్‌, ద్రవిడ్‌ పేర్ల కలయికతో అతడికి పేరు పెట్టారు.

FOLLOW US: 

భారత్‌, న్యూజిలాండ్‌ మొదటి టీ20లో ఒక ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే కివీస్‌ యువ క్రికెటర్‌ 'రచిన్‌ రవీంద్ర'. భారత సంతతి వ్యక్తే కావడంతో భారతీయులు అతడి గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ తెందూల్కర్‌ పేర్లు కలిసేలా అతడు పేరు పెట్టుకోవడం గమనార్హం.

న్యూజిలాండ్‌ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ స్థానం  సంపాదించుకుంటున్నాడు రచిన్‌ రవీంద్ర. 2016, 2018లో కివీస్ తరఫున అండర్‌ 19 ప్రపంచకప్‌లు ఆడాడు. 2018-19లో సీజన్లో వెల్లింగ్టన్‌ తరఫున ఆడాడు. అదే సీజన్లో లిస్ట్‌-ఏ క్రికెట్లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. ఫోర్డ్‌ ట్రోఫీలో లిస్ట్‌-ఏలో తొలి శతకం అందుకున్నాడు. ప్లంకెట్‌ షీల్డ్‌లో ఫస్ట్‌క్లాస్‌ శతకం అందుకున్నాడు.

2020, నవంబర్‌లో న్యూజిలాండ్‌-ఏ తరఫున వెస్టిండీస్‌ పర్యటనలో ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడాడు. జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ జట్టులోనూ ఉన్నాడు. 2021, సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు టెస్టులు సిరీసులో అరంగేట్రం చేశాడు. బుధవారం టీమ్‌ఇండియాతో మ్యాచులోనూ ఆడాడు.

రచిన్‌ తల్లిదండ్రులు రవి కృష్ణమూర్తి, దీపా కృష్ణమూర్తి. తండ్రి రవి సిస్టమ్‌ ఆర్కిటెక్ట్‌. బెంగళూరులో ఉండేవారు. 1990లో న్యూజిలాండ్‌లో హట్‌హాక్స్‌ క్లబ్‌ను స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి అతడికీ క్రికెట్‌ అంటే ఇష్టం. బెంగళూరు జట్టులో ఆడుతుండేవాడు. కాగా రచిన్‌ నాలుగేళ్లుగా ఆంధ్రాలోని అనంతపురంలోనే క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి శీతాకాలం ఇక్కడి వచ్చి నాలుగు నెలలు ఉంటాడు.

Also Read: Hardik Pandya Wrist Watch: చిక్కుల్లో హార్ధిక్ పాండ్యా.. కోట్ల విలువ చేసే వాచ్‌లు సీజ్..! స్పందించిన స్టార్ ఆల్ రౌండర్

Also Read: IPL 2021: ఎంత బాధేసిందో తెలుసా!! సన్‌రైజర్స్‌ను ఎంత ప్రేమించానో మీకెవ్వరికీ తెలియదన్న డేవిడ్‌ వార్నర్‌

Also Read: Rohit Sharma on Kohli: విరాట్‌ గురించి రోహిత్‌ బిగ్‌ స్టేట్‌మెంట్‌.. ఏం చెప్పాడో తెలుసా?

Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ

Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!

Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 03:06 PM (IST) Tags: Sachin Tendulkar New Zealand Rahul Dravid Cricketer Rachin Ravindra Indian-origin

సంబంధిత కథనాలు

IND vs ENG 5th Test: శుక్రవారమే ఫైనల్‌ టెస్టు! భారత్‌xఇంగ్లాండ్‌ షెడ్యూలు ఇదే!

IND vs ENG 5th Test: శుక్రవారమే ఫైనల్‌ టెస్టు! భారత్‌xఇంగ్లాండ్‌ షెడ్యూలు ఇదే!

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Deepak Hooda Century: టీ20 సెంచరీ వెనక అసలు రీజన్‌ చెప్పిన దీపక్‌ హుడా!

Deepak Hooda Century: టీ20 సెంచరీ వెనక అసలు రీజన్‌ చెప్పిన దీపక్‌ హుడా!

IND vs IRE, Match Highlights: హుడా హుద్‌హుద్‌ తెప్పించినా! టీమ్‌ఇండియాకు హార్ట్‌ అటాక్‌ తెప్పించిన ఐర్లాండ్‌

IND vs IRE, Match Highlights: హుడా హుద్‌హుద్‌ తెప్పించినా! టీమ్‌ఇండియాకు హార్ట్‌ అటాక్‌ తెప్పించిన ఐర్లాండ్‌

టాప్ స్టోరీస్

Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ - విమర్శలు తిప్పికొట్టేందుకు దొరికింది ఛాన్స్

Business Reforms Action Plan 2020 :  ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ - విమర్శలు తిప్పికొట్టేందుకు దొరికింది ఛాన్స్

Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

PAN Aadhaar Linking: నేడే ఈ పని చేయండి! లేదంటే రూ.1000 ఫైన్‌ కట్టండి!!

PAN Aadhaar Linking: నేడే ఈ పని చేయండి! లేదంటే రూ.1000 ఫైన్‌ కట్టండి!!

Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి

Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి