Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Ind vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ కూడా భారత్ సొంతం అయింది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ కూడా భారత్ సొంతం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓవర్లలో వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ కూడా 2-0తో భారత్ సొంతం అయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్, కొత్త వైస్ కెప్టెన్ రాహుల్‌ల RRR త్రయం తమ మొదటి సిరీస్‌నే గెలుచుకుని శుభారంభాన్ని అందుకుంది.
అదరగొట్టిన భారత బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (31: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), డేరిల్ మిషెల్ (31: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) క్రీజులో ఉన్నంత సేపు రన్ రేట్ 11గా ఉండటం విశేషం. మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్ల పాటు పరుగులు బాగానే వచ్చాయి. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
ఆరు ఓవర్ల తర్వాత భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్‌లతో పాటు హర్షల్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదించింది. పవర్ ప్లే తర్వాత ఏడు ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. దీంతోపాటు మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మార్క్ చాప్‌మన్ (21: 17 బంతుల్లో, మూడు ఫోర్లు), డేరిల్ మిషెల్ కూడా అవుటవ్వడంతో 13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులతో కాస్త కష్టాల్లో పడింది.
ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (34: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) కాస్త వేగంగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకున్నట్లు అనిపించినా.. భారత బౌలర్లు మళ్లీ మంచి కంబ్యాక్ ఇచ్చారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, చాహర్, అక్షర్, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఒకదశలో 200 పైచిలుకు స్కోరును సులభంగా సాధిస్తారనున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో 153 పరుగులకే పరిమితం అయింది.
ఓపెనర్లు అదుర్స్
భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (55: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఐదు సిక్సర్లు), కేఎల్ రాహుల్ (65: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తిగా పైచేయి సాధించారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ పూర్తి సాధికారికతతో ఆడారు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ వదిలేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 79 పరుగులు సాధించింది.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ చేసిన అనంతరం టిమ్ సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఓపెనర్లిద్దరూ మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్ శర్మ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో సౌతీ మళ్లీ న్యూజిలాండ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి భారత్ శిబిరంలో కంగారును తీసుకొచ్చాడు. అయితే వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ మూడు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
Also Read: Ricky Ponting Update: ఐపీఎల్ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్ ఆఫర్.. ఎందుకు తిరస్కరించాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి