ABD Retirement: గుండె బద్దలైంది..! లవ్‌యూ సోదరా అంటూ ఏబీడీ, కోహ్లీ బ్రొమాన్స్!
డివిలియర్స్ వీడ్కోలుతో తన గుండె పగిలిందని కోహ్లీ అంటున్నాడు. అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడని చెబుతున్నాడు. లవ్‌యూ బ్రదర్ అంటూ వీడ్కోలు పలికాడు.
తాను కలిసిన అద్భుత వ్యక్తుల్లో ఏబీ డివిలియర్స్ ఒకరని టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఇకపై అతడు ఆర్‌సీబీకి ఆడడని తెలియడంతో తన గుండె పగిలిందని తెలిపాడు. ఏదేమైనా అతడు వ్యక్తిగతంగా సరైన నిర్ణయమే తీసుకున్నాడని వెల్లడించాడు.
దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నేడు అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్ల క్రితమే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగులు ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ రెండో అంచె ఆడాడు. ఇక లీగు క్రికెట్‌కూ వీడ్కోలు పలుకుతున్నట్టు ఈ రోజు ప్రకటించాడు. అతడి వీడ్కోలుపై కోహ్లీ స్పందించాడు.
Love u too my brother
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
'మా తరంలో అత్యుత్తమ ఆటగాడు. నేను కలిసిన అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి. నువ్వు సాధించిన దానికి గర్వపడాలి. ఆర్‌సీబీకి నువ్వెంతో చేశావు సోదరా! మన బంధం ఆటను మించింది. అదెప్పుడూ అలాగే ఉంటుంది' అని కోహ్లీ అన్నాడు. 'నువ్విక క్రికెట్ ఆడవని తెలియడంతో నా హృదయం బద్దలైంది. నీకు ఏది మంచిదో అలాంటి నిర్ణయమే తీసుకున్నావు. నువ్వు ప్రేమించినట్లే నీ కుటుంబమూ నిన్ను ప్రేమిస్తోంది. ఐ లవ్ యూ ఏబీ డివిలియర్స్' అని మరో ట్వీట్ చేశాడు. అందుకు ఏబీడీ 'లవ్ యూ టూ మై బ్రదర్' అని బదులిచ్చాడు.
To the best player of our times and the most inspirational person I've met, you can be very proud of what you've done and what you've given to RCB my brother. Our bond is beyond the game and will always be.
— Virat Kohli (@imVkohli) November 19, 2021
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
Also Read: Ricky Ponting Update: ఐపీఎల్ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్ ఆఫర్.. ఎందుకు తిరస్కరించాడంటే?
Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి