MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
ఎంఎస్ ధోనీ మరోసారి అందరినీ సందిగ్ధంలోకి నెట్టేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడో లేదో స్పష్టం చెప్పడం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు.
ఐపీఎల్-2022 ఆడాలో వద్దో ఇంకా నిర్ణయించుకోలేదని చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు. సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉందన్నాడు. నిర్ణయం తీసుకొనేందుకు ఇంకెతో సమయం ఉందన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడే నిర్ణయం చెప్పడం తొందరపాటే అవుతుందని వెల్లడించాడు. ఓ న్యూస్ ఏజెన్సీతో అతడీ మాటలు అన్నాడు.
'తొందర పాటు తగదు. సీజన్‌కు ఇంకెంతో సమయం ఉంది. కుదురుగా ఆలోచిస్తాను. ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం. ఐపీఎల్ 2022 ఏప్రిల్‌లో జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదు' అని ఎంఎస్ ధోనీ అన్నాడు. కాగా మహీ వచ్చే సీజన్లో ఆడతాడని ఇంతకు ముందే చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరో రెండేళ్ల వరకు అతడు తమతోనే ఉంటాడన్న నమ్మకాన్ని సీఎస్‌కే వ్యక్తం చేసింది.
తాను సాధించడానికి ఇంకేమీ మిగల్లేదని ధోనీ గతంలో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. 2021 సీజన్ ఫైనల్లో కోల్‌కతాపై విజయం తర్వాత అతడీ మాటలు అన్నాడు. రాబోయే కాలంలో సీఎస్‌కే కోర్ గ్రూప్‌ను సిద్ధం చేసుకోవాల్సిన తరుణం వచ్చిందని తెలిపాడు. రెండు కొత్త ప్రాంఛైజీలు రావడంతో బీసీసీఐ నిర్ణయాన్ని బట్టి తమ ఆలోచనలు ఉంటాయని పేర్కొన్నాడు.
'నేనింతకు ముందే చెప్పాను. అంతా బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రెండు కొత్త జట్లు వస్తున్నాయి. సీఎస్‌కేకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నేను టాప్ 3 లేదా 4 ఉండటం ముఖ్యం కాదు. ఫ్రాంచైజీకి ఇబ్బందులు రాకుండా బలమైన కీలక బృందాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. రాబోయే పదేళ్లపాటు ఎవరు సేవలందిస్తారో చూడాల్సి ఉంది' అని ధోనీ అప్పుడు పేర్కొన్నాడు.
Also Read: Tim Paine Quits: మహిళకు ఆసీస్ క్రికెటర్ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్
Also Read: AB de Villiers Retirement: ఇకపై కోహ్లీ, ఏబీడీ కలిసి ఆడరు.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఏబీడీ?
Also Read: ABD Retirement: గుండె బద్దలైంది..! లవ్‌యూ సోదరా అంటూ ఏబీడీ, కోహ్లీ బ్రొమాన్స్!
Also Read: MS Dhoni fan: ధోనీని చూసేందుకు 1436 కి.మీ పాదయాత్ర చేసిన డైహార్డ్ ఫ్యాన్!
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి