WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
రెండో టీ20లో రాంచీ వీరాభిమాని ఒకరు సెక్యూరిటీని ఉల్లంఘించాడు. మైదానంలోకి వచ్చి రోహిత్ పాదాలను తాకాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది.
భారతదేశంలో క్రికెట్‌ను మతంగా క్రికెటర్లను దేవుళ్లుగా భావిస్తుంటారు! ఇంకా చెప్పాలంటే ఆటగాళ్లకు అభిమానులు కాదు వీరాభిమానులు ఉంటారు! బయట కనిపించినప్పుడే కాకుండా మైదానంలోనూ వారిని కలుసుకొనేందుకు ఆరాట పడుతుంటారు. కుదిరితే కాళ్లమీద పడి దండాలు పెట్టేస్తుంటారు.
రాంచీ వేదికగా న్యూజిలాండ్, భారత్ రెండో టీ20లో ఇలాంటి సంఘటనే జరిగింది. మ్యాచ్ మధ్యలో ఓ వీరాభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించాడు. తన అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే స్పందించిన హిట్‌మ్యాన్ తన అభిమానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డాడు. సురక్షితంగా స్టాండ్స్‌లోకి తిరిగివెళ్లేలా అతడిని ఒప్పించాడు. దీంతో మ్యాచుకు కాసేపు అంతరాయం కలిగింది.
here's the video 🤩🥳🥳🥳@ImRo45 Fan boy pic.twitter.com/O9XTxoEd7L
— MI💙 (@ThalaMa31670521) November 19, 2021
రోహిత్‌కు అభిమానులు ఇలా దండాలు పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ ఇలాగే మరో అభిమాని మైదానంలోకి వచ్చి నమస్కరించాడు. టీమ్‌ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్, సునిల్ గావస్కర్, ఎంఎస్ ధోనీ ఆడేటప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
ఇక కివీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం అందుకుంది. జోరుమీదున్న ప్రత్యర్థిని మొదట 153/6కే పరిమితం చేసిన భారత జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ (49 బంతుల్లో 65), రోహిత్ శర్మ (36 బంతుల్లో 55) అర్ధశతకాలు దంచేశారు. ఆఖర్లో రిషభ్ పంత్ వరుసగా రెండు సిక్సర్లు బాదేసి విజయం అందించాడు.
Also Read: Tim Paine Quits: మహిళకు ఆసీస్ క్రికెటర్ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్
Also Read: AB de Villiers Retirement: ఇకపై కోహ్లీ, ఏబీడీ కలిసి ఆడరు.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఏబీడీ?
Also Read: ABD Retirement: గుండె బద్దలైంది..! లవ్‌యూ సోదరా అంటూ ఏబీడీ, కోహ్లీ బ్రొమాన్స్!
Also Read: MS Dhoni fan: ధోనీని చూసేందుకు 1436 కి.మీ పాదయాత్ర చేసిన డైహార్డ్ ఫ్యాన్!
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి