Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Daaku Maharaaj 2nd Single: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న 'డాకు మహారాజ్' సినిమాలో రెండో పాట చిన్నిని విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు మాస్ జనాలలో ఎంతటి ఆదరణ ఉందో... ఆయనపై కుటుంబ ప్రేక్షకులలో అంతకు మించి ప్రేమ, అభిమానం ఉన్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు సెంటిమెంట్ మేళవించిన కథలు వస్తే అసలు వదులుకోరు బాలయ్య. వచ్చే సంక్రాంతికి రానున్న ఆయన సినిమా 'డాకు మహారాజ్'లో కూడా మంచి సెంటిమెంట్ ఉందని అతి త్వరలో రాబోయే రెండో పాట స్టిల్ చూస్తే అర్థం అవుతుంది.
డిసెంబర్ 23న చిన్ని పాట విడుదల
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రానికి బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల అయింది. 'దేఖో దేఖో దేఖో' అంటూ సాగే ఆ పాటకు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి, శ్రోతల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ సంతోషంలో రెండో పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది.
డిసెంబర్ 23... అంటే ఈ సోమవారం 'డాకు మహారాజ్' సినిమా నుంచి 'చిన్ని...' పాటను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. బాలకృష్ణతో పాటు ఒక చిన్నారి మీద ఈ పాటను తెరకెక్కించారు. 'భగవంత్ కేసరి' సినిమాలో బాలయ్య, శ్రీ లీల మీద తెరకెక్కించిన 'ఉయ్యాలో ఉయ్యాల...' పాటకు ఎంత అద్భుతమైన స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి తమన్ ఎటువంటి బాణీ అందించారో చూడాలి.
Also Read: 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
A melody that captures the most beautiful emotions!! 😍💯#DaakuMaharaaj 2nd single #Chinni will be out on Dec 23rd! ❤️
— Sithara Entertainments (@SitharaEnts) December 20, 2024
A @MusicThaman Musical 💕🎹
A @dirbobby Film 💥
And In Cinemas Worldwide from Jan 12, 2025. 🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/2KY03YRYIw
జనవరి 12న థియేటర్లలోకి 'డాకు మహారాజ్'
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి 'డాకు మహారాజ్' సినిమా రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైర్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది.
'డాకు మహారాజు'లో బాలకృష్ణ సరసన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటించారు. 'అఖండ' విజయం తర్వాత బాలయ్యకు జోడిగా మరోసారి ఆమె నటించిన చిత్రం ఇది. నాని 'జెర్సీ', వెంకటేష్ 'సైంధవ్' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ మరొక హీరోయిన్. తెలుగు అమ్మాయి యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ సినిమాలో బాబి డియోల్ విలన్.
Also Read: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?