Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
ఉమెన్ బాటమ్‌వేర్ సంస్థ గో ఫ్యాషన్ ఐపీవోకు స్పందన బాగుంది. గ్రే మార్కెట్ ప్రీమియం మెరుగ్గా ఉంది. షేరు భారీ ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
గో ఫ్యాషన్ ఐపీవోకు మంచి స్పందన లభిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే 6.78 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. గ్రే మార్కెట్లోనూ ధర బాగానే ఉంది. మొదట రూ.460గా ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం ఇప్పుడు రూ.40 పెరిగి రూ.500కు చేరుకుంది. సోమవారం ఐపీవో సబ్‌స్క్రిప్షన్లు ముగుస్తాయి.
ఉమెన్ బాటమ్ వేర్ ఉత్పత్తిదారు గో ఫ్యాషన్ రూ.1013 కోట్ల విలువతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. చాలామంది విశ్లేషకులు ఐపీవోను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వుమెన్ బాటమ్‌వేర్‌లో కంపెనీకి మార్కెట్లో ఎనిమిది శాతం వాటా ఉంది. సంస్థ విస్తరణ ప్రణాళికలు బాగున్నాయి. రూ.225 నుంచి రూ.1599 శ్రేణిలో ఉత్పత్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం రూ.135 బిలియన్లుగా ఉన్న మార్కెట్ విలువను 2025 నాటికి రూ.243 బిలియన్లుగా పెంచుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
పబ్లిక్ ఇష్యూకు వచ్చిన కంపెనీ ఎంత ప్రీమియంతో మార్కెట్లో లిస్టవుతుందో గ్రే మార్కెట్ ద్వారా అంచనా వేయొచ్చు. ఇప్పుడు గో ఫ్యాషన్ గ్రే మార్కెట్ ప్రీమియం రూ.500గా ఉంది. అంటే షేరు ఇష్యూ చేస్తున్న రూ.690కి అదనంగా రూ.500 కలుపుకొని మొత్తం రూ.1190తో షేర్లు లిస్టవుతాయని దీని అర్థం. అంటే ఒక్కో ఈక్విటీ షేరు పైన 72 శాతం వరకు లాభం ఉంటుంది.
Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!
Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి