Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఓవర్ టేకింగ్ చేయడం కామన్. ఆ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.
మనలో కొంతమందికి డ్రైవింగ్ చేయడం సరదా. అయితే దురదృష్టవశాత్తూ ఆ సరదా కాస్తా విషాదంగా మారిపోతుంది. చాలా ట్రాఫిక్ యాక్సిడెంట్లు మానవ తప్పిదం ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఈ తప్పులే తీర్చిదిద్దుకోలేనివిగా మారుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఓవర్ టేక్ చేసే సమయాల్లో చోటు చేసుకునేవి ఉంటాయి. ఎదురుగా వెళ్లే ఆటోని ఓవర్ టేక్ చేయబోయి.. టాలీవుడ్ హీరో సాయి ధరం తేజ్ ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఓవర్ టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం ఎప్పుడూ చేయకండి.
1. మిర్రర్ చెక్ చేయాలి
మీరు ఓవర్ టేక్ చేసేటప్పుడు మీ బైక్ మిర్రర్స్, పక్కగా ఎవరైనా వస్తున్నారేమో అని ముందుగా చూసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే.. పక్కగా వెళ్లే వాహనాన్ని ఢీకొనడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ ప్రిపేర్డ్‌గా ఉండకపోవడం కూడా యాక్సిడెంట్లకు కారణం అవుతుంది. కాబట్టి మీరు ఓవర్ టేక్ చేసేటప్పుడు మిర్రర్స్ చెక్ చేసుకోవడం మంచిది.
2. ఇండికేటర్ వేయాల్సిందే
ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇండికేటర్ కచ్చితంగా వేయాల్సిందే. రైట్ నుంచి ఓవర్ టేక్ చేయడానికి కాస్త ఎక్కువ సేపు ముందు నుంచి ఇండికేటర్ వేస్తే.. వెనకాల వచ్చే వాహనాలు దానికి తగ్గట్లు మీ లేన్‌లోకి రాకుండా ఉంటాయి. ఓవర్ చేయడానికి 10 సెకన్ల ముందు ఇండికేటర్ వేస్తే సరిపోతుంది.
3. మలుపుల దగ్గర ఓవర్‌టేక్ చేయకండి
కర్వ్ దగ్గర, బ్లైండ్ బెండ్ దగ్గర ఓవర్ టేక్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మలుపుల దగ్గర అటువైపు నుంచి ఎవరు వస్తున్నారో మనకు కనిపించదు. కాబట్టి మలుపుల దగ్గర ఓవర్ టేక్ అస్సలు చేయకండి.
4. ఒకటి కంటే ఎక్కువ వాహనాలను ఒకేసారి ఓవర్ టేక్ చేయండి
మీరు వేగంగా వెళ్తూ, కంగారుగా ఉన్నప్పటికీ.. ఒకేసారి ఎక్కువ వాహనాలను ఓవర్ టేక్ చేయకండి. ఎందుకంటే మీరు మీ లేన్‌లోనే ఉన్న మరో వ్యక్తి కూడా ఓవర్ టేక్ చేయాలనుకుంటే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరలో ఉన్న ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ప్రాణం.. కాలం కంటే గొప్పది.
5. ఓవర్‌టేక్ చేసే వాహనాన్ని ఓవర్‌టేక్ చేయకండి
ఆల్రెడీ ఓవర్‌టేకింగ్‌లో ఉన్న వాహనాన్ని అస్సలు ఓవర్ టేక్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆ వాహనం ఓవర్ టేక్ చేసేవరకు ఆగి.. తర్వాత ఓవర్ టేక్ చేయడం మంచిది.
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!