search
×

EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!

చందాదారులకు ఉపయోగపడే అప్‌డేట్‌ను చెప్పింది ఈపీఎఫ్‌వో. ఇకపై సులభంగా ఇంటి నుంచే నామినేషన్‌ మార్పు చేయొచ్చు. సింపుల్‌ ఈ కింద విధానం ఫాలో అయితే చాలు.

FOLLOW US: 

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఉపయోగపడే మరో మార్పు చేసింది. సులభంగా నామినేషన్‌ మార్చుకొనే అవకాశం కల్పించింది. ఒకప్పుడు ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ నామినీ పేరు మార్చాలంటే కొత్తగా పత్రాలు తీసుకొని వాటిని నింపి కార్యాలయంలో సమర్పించాల్సి వచ్చేది.

ఇకపై నామినేషన్‌ మార్పు చేసేందుకు అలా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. తేలికగా ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి పీఎఫ్‌ నామినేషన్‌ను మార్చుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ఓ ట్వీట్‌ చేసింది. 'ఈపీఎఫ్‌ సభ్యులు ఇంతకు ముందున్న ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ నామినేషన్‌ను మార్చేందుకు కొత్త నామినేషన్‌ను ఆన్‌లైన్‌లోనే సమర్పించొచ్చు' అని ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేసింది. 

పాత నామినీ పేరు రద్దు చేయాలంటే అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తది చేస్తే ఆటోమేటిక్‌గా పాతది రద్దవుతుంది.

నామినీ దాఖలు ప్రక్రియ ఇదే

 • ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in.కు లాగిన్‌ అవ్వాలి.
 • 'సర్వీసెస్‌'కు వెళ్లి 'ఫర్‌ ఎంప్లాయిస్‌' ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి.
 • డ్రాప్‌డౌన్‌ మెనూలో 'మెంబర్‌ యూఏఎన్‌/ఆన్‌లైన్‌ సర్వీస్‌ (ఓసీఎస్‌/ఓటీసీపీ) ట్యాబ్‌ క్లిక్‌ చేయాలి.
 • మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
 • మేనేజ్‌ ట్యాబ్‌లో 'ఈ-నామినేషన్‌'ను ఎంచుకోవాలి.
 • కుటంబ సభ్యుల వివరాల మార్పు కోసం 'యెస్‌'ను క్లిక్‌ చేయాలి.
 • 'యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌'ను క్లిక్‌ చేయండి.
 • వాటా డిక్లేర్‌ చేసేందుకు 'నామినేషన్‌ డీటెయిల్స్‌'ను క్లిక్‌ చేయండి.
 • డిక్లరేషన్‌ తర్వాత 'సేవ్‌ ఈపీఎఫ్‌ నామినేషన్‌' క్లిక్‌ చేయండి.
 • ఓటీపీ కోసం 'ఈ-సైన్‌' క్లిక్‌ చేయండి.
 • ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
 • ఓటీపీని సబ్‌మిట్‌ చేయండి.
 • దీంతో ఈపీఎఫ్‌వోలో 'ఈ-నామినేషన్‌' పూర్తవుతుంది.

ఈపీఎఫ్‌వోలో ఒకరి కన్నా ఎక్కువ మందిని నామినీగా చేర్చొచ్చు. ఆన్‌లైన్‌లో ఈ-నామినేషన్‌ సబ్‌మిట్‌ చేశాక ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌ సమర్పించాల్సిన అవసరం లేదు.

Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు

Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Nov 2021 05:52 PM (IST) Tags: EPFO EPF PF Nomination Nominee EPFO update EPS

సంబంధిత కథనాలు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

Gold-Silver Price: గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? నేటి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? నేటి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ 'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

Rakesh Jhunjhunwala Quotes: మార్కెట్లో కోట్లు గడించాలని ఉందా! RJ 'సక్సెస్‌ మంత్రాలు' ఇవే!

టాప్ స్టోరీస్

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

Mahesh Babu: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!

Mahesh Babu: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!